HomeతెలంగాణNizamabad Police Commissionerate | తొమ్మిది మంది కానిస్టేబుళ్లకు ప్రమోషన్​..

Nizamabad Police Commissionerate | తొమ్మిది మంది కానిస్టేబుళ్లకు ప్రమోషన్​..

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Police Commissionerate | జిల్లాలో 9 మంది కానిస్టేబుళ్లకు హెడ్​కానిస్టేబుళ్లకు (Head constables) ప్రమోషన్​ లభించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర డీజేపీ (Telanagana DGP) గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రమోషన్లు (Promotions) పొందిన కానిస్టేబుళ్లు సీపీ సాయిచైతన్యను (CP Sai chaitanya) మర్యాదపూర్వకంగా కలిశారు.

కొంతకాలంగా ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న కానిస్టేబుళ్లకు (constables) పదోన్నతి లభించడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. సీపీ వారికి బ్యాడ్జీలను అందజేశారు. ప్రమోషన్లు పొందిన వారిలో సీహెచ్ రాములు (సిరికొండ), పి.కిరణ్ గౌడ్ (ఇందల్ వాయి), కె.కిషన్ (డిచ్పల్లి) పి.అర్జున్ (నిజామాబాద్ రూరల్ ), ఎస్.సత్పాల్ సింగ్ (ట్రాఫిక్ పోలీస్ స్టేషన్), టి శ్రీనివాస్ (ట్రాఫిక్ పోలీస్ స్టేషన్), సీనా(రైల్వే ), బి శ్రీనివాస్ (సైబర్ క్రైం), కిష్ణయ్య(రైల్వే) ఉన్నారు.

Must Read
Related News