Homeజిల్లాలునిజామాబాద్​Limbadri Gutta | భక్తి శ్రద్ధలతో నింబాచల గిరిప్రదక్షిణ

Limbadri Gutta | భక్తి శ్రద్ధలతో నింబాచల గిరిప్రదక్షిణ

లింబాద్రి గుట్టపై బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ మేరకు సోమవారం నింబాచల గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, భీమ్‌గల్ : Limbadri Gutta | శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన నింబాచల గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గోవింద నామస్మరణలతో అశేష భక్తజనం మధ్య సోమవారం గిరిప్రదక్షిణ (Giripradakshina) సాగింది.

శ్రీవారి ఉత్సవ యాగ సంరక్షణనకు శ్రీచక్ర స్వాముల విగ్రహాలతో నింబాద్రి కొండ ప్రదక్షిణ నిర్వహించారు. ముందుగా పుష్పాలంకృత పల్లకీలో శ్రీచక్ర స్వాముల వారిని గోవింద నామస్మరణతో కొండ ప్రదక్షిణ చేశారు. గిరి ప్రదక్షిణ చేసిన భక్తుల కోర్కెలను నేర వేరుస్తాడని భక్తుల నమ్మకం.

Limbadri Gutta | కొండపై తులసీ వివాహం

స్వామి యోగ నిద్ర నుంచి మేల్కొన్న పర్వదినాన్ని పురస్కరించుకొని విష్ణు, ప్రభోదోత్సవంతో పాటు తులసీ వివాహం జరిపిస్తారు. మొదట తులసి, విష్ణువులకు షోడశోపచార పూజ, వాద్య ఘోషములతో స్వామిని మేల్కొలిపారు. శాస్త్ర విధిగా తులసీ, విష్ణువుల వివాహం నిర్వహించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

Limbadri Gutta | గిరి ప్రదక్షిణ సందర్బంగా ప్రత్యేక బందోబస్తు

భీమ్​గల్​ సర్కిల్​ ఇన్​స్పెక్టర్​ సత్యనారాయణ (Bheemgal CI Satyanarayana) ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్సై సందీప్​తో (SI Sandeep) పాటు సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూశారు.