ePaper
More
    HomeసినిమాIndian house movie | హీరో నిఖిల్ సినిమా షూటింగ్‌లో ప్ర‌మాదం.. సెట్ ధ్వంసం, ప‌లువురికి...

    Indian house movie | హీరో నిఖిల్ సినిమా షూటింగ్‌లో ప్ర‌మాదం.. సెట్ ధ్వంసం, ప‌లువురికి గాయాలు

    Published on

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Indian house movie : హీరో నిఖిల్ Nikhil Siddharth వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ క్రేజ్ పెంచుకుంటూ పోతున్నాడు. ఆయ‌న న‌టించిన కార్తికేయ‌2 చిత్రంతో పాన్ ఇండియా ఇమేజ్ ద‌క్కించుకున్నాడు. ప్ర‌స్తుతం నిఖిల్ చారిత్రక నేపథ్యంతో ది ఇండియా హౌస్‌ సినిమా చేస్తున్నాడు.

    వీర్‌ సావర్కర్‌(Veer Savarkar), నాథూరామ్‌ గాడ్సే(Nathuram Godse) ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కుతోందని టాక్ న‌డుస్తుంది.. ఈ సినిమాను గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, అభిషేక్‌ అగర్వాల్‌తో కలిసి నిర్మిస్తున్నారు. సాయి మజ్రేకర్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. రెండేళ్ల కిందట ప్రారంభించిన ఈ సినిమా షూటింగ్ చాలా నెమ్మ‌దిగా సాగుతుంది. అయితే ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్(Hyderabad) శివార్లలోని శంషాబాద్(Shamshabad) సమీపంలో జరుగుతోంది.

    Indian house movie : పెద్ద ప్ర‌మాదం..

    ఈ మూవీ చిత్రీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన ఒక భారీ వాటర్ ట్యాంక్ water tank ఒక్కసారిగా కూలిపోవడంతో పలువురు సాంకేతిక సిబ్బంది గాయపడ్డారు. ఈ ఘటనతో సినిమా సెట్ మొత్తం జలమయమైంది. ఇప్పటికే సినిమా ఆలస్యం కాగా.. తాజాగా జరిగిన ప్రమాదంతో మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఈ ప్రమాదంలో అసిస్టెంట్ కెమెరామెన్‌కు తీవ్ర గాయాలయ్యాయని.. మరి కొంతమందికి గాయాలైనట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఒకరు మినహా మిగతా వారి పరిస్థితి నిలకడగా ఉందని చిత్రవర్గాలు చెబుతున్నాయి.

    నీళ్లన్నీ సెట్‌లోకి వరదలా పోటెత్తడంతో సెట్‌ నాశమైందని సమాచారం. ఇక లైట్లు.. కెమెరాలు(cameras).. ఇతర సినిమా షూటింగ్‌ సామగ్రి దెబ్బతిందని చిత్రబృందం తెలిపింది. ప్రమాదం జరిగిన సమయంలో హీరో నిఖిల్ సిద్ధార్థ్ సెట్‌లో ఉన్నారా లేదా అనే విషయంపై కూడా స్పష్టత లేదు. వాటర్ ట్యాంక్ కూలిన తర్వాత సెట్‌లో నెలకొన్న గందరగోళ పరిస్థితులకు సంబంధించిన కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలో Social media వైరల్ అవుతున్నాయి. ప్రమాదానికి గురైన సన్నివేశం కోసం పెద్ద మొత్తంలో నీటిని ఉపయోగించాల్సి రావడం, దానికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే భద్రతాపరమైన సవాళ్లు కూడా ఎదురై ఉంటాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

    More like this

    Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్​ ఘన విజయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో (Vice President Elections) ఎన్డీఏ అభ్యర్థి సీపీ...

    Indira Saura Giri Jala Vikasam | ఇందిర సౌర గిరి జల వికాసం పథకం కింద లబ్ధిదారులను గుర్తించాలి

    అక్షరటుడే, ఇందూరు: Indira Saura Giri Jala Vikasam | ఇందిర సౌర గిరి జలవికాసం పథకం ద్వారా...

    Kotagiri Mandal | గిరిజనలు ఐక్యతతో సాగాలి

    అక్షరటుడే, కోటగిరి: Kotagiri Mandal | గిరిజనలు ఐక్యతతో సాగాలి గిరిజనులంతా ఐక్యతతో ముందుకు సాగి, సేవాలాల్‌ బాటలో...