HomeUncategorizedIndia House Movie | తన మూవీ షూటింగ్‌లో జ‌రిగిన ప్ర‌మాదంపై స్పందించిన నిఖిల్

India House Movie | తన మూవీ షూటింగ్‌లో జ‌రిగిన ప్ర‌మాదంపై స్పందించిన నిఖిల్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:India House Movie | కార్తికేయ‌2తో పాన్ ఇండియా స్టార్ డ‌మ్ ఇమేజ్ సొంతం చేసుకున్న నిఖిల్(Hero Nikhil) తాజాగా క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్​లో ప్రమాదం జరిగింది. దీనితో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది.శంషాబాద్​ సమీపంలో ‘ది ఇండియా హౌస్​'(The India House) సినిమా సెట్ వేశారు. అక్కడ స్విమ్మింగ్ పూల్​ చిత్రీకరణ చేస్తుండగా, కట్ట తెగి ఒక్కసారిగా నీరు వరదలా సెట్​లోకి దూసుకొచ్చింది. దీంతో ఆ సెట్‌లో ఉన్న పలువురు గాయపడినట్లు సమాచారం. ది ఇండియా హౌస్​ అనే టైటిల్‌తో మూవీ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుండ‌గా, ఈ పాన్ఇండియా Pan India మూవీని రామ్ వంశీకృష్ణ తెరకెక్కిస్తున్నారు.

India House Movie | ప్రాణ న‌ష్టం లేదు..

అభిషేక్​ అగర్వాల్​ ఆర్ట్స్​, వి మెగా పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రముఖ హిందీ నటుడు అనుపమ్‌ ఖేర్‌ Anupam kher ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. 1905 నేపథ్యంలో ప్రేమ, విప్లవం మొదలైన అంశాలతో నిండి ఉన్న ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం. బుధవారం జరుగుతుండగా ఓ ప్రమాదం సంభవించింది. సముద్రపు సన్నివేశాల కోసం ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో షూటింగ్‌ లొకేషన్ మొత్తం వరదతో నిండిపోయింది. ఈ ప్రమాదంలో అసిస్టెంట్ కెమెరామెన్‌(Assistant cameraman)కు తీవ్ర గాయాలయ్యాయని.. మరి కొంతమందికి గాయాలైనట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఒకరి మినహా మిగతా వారి పరిస్థితి నిలకడగా ఉందని చిత్రవర్గాలు చెబుతున్నాయి.

ప్రమాదం గురించి నిఖిల్ Nikhil మాట్లాడుతూ, “ప్రేక్షకులకు ఒక గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందించే ప్రయత్నంలో కొన్నిసార్లు రిస్క్‌లు తప్పవు. అలాంటి సమయంలోనే ఈ ఘటన జరిగింది. మా సిబ్బంది తీసుకున్న తక్షణ జాగ్రత్తల వల్ల పెను ప్రమాదం నుంచి బయటపడ్డాం. కానీ, దురదృష్టవశాత్తూ కొన్ని ఖరీదైన పరికరాలను కోల్పోయాం. దేవుడి దయ వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు, అందరం సురక్షితంగా ఉన్నాం” అని తెలిపారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.