అక్షరటుడే, వెబ్‌డెస్క్: Niharika Konidela | మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల తనయ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మెగా డాటర్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆమె, మొదట్లో యాంకర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
‘ఢీ’ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నిహారిక, ఆ తర్వాత ‘ఒక మనసు’ సినిమాతో హీరోయిన్‌గా మారింది. ఈ ఎమోషనల్ డ్రామాపై భారీగానే అంచనాలు ఉన్నా ఆశించిన విజయం సాధించలేదు. ఆ తర్వాత పలు సినిమాలలో కథానాయికగా నటించి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసిన ఏ సినిమా కూడా నిహారికకు (Niharika Konidela) మంచి విజయాలు అందించలేకపోయాయి.
Niharika Konidela | ఇదే సీక్రెట్..
దాంతో నటనకు కొంత విరామం ఇచ్చి, తన దృష్టిని నిర్మాణంవైపు మళ్లించింది. నిహారిక మొదట్లో ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ (Pink Elephant Pictures) అనే బ్యానర్‌పై వెబ్ సిరీస్‌లు రూపొందించిన విషయం విదితమే. వాటికి మంచి స్పందన రావడంతో పూర్తి స్థాయి నిర్మాతగా మారి, ‘కమిటీ కుర్రాళ్లు’ అనే సినిమాను నిర్మించింది. గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ కావడం ఆమెకు గట్టి ప్రోత్సాహమిచ్చింది. ప్రస్తుతం నిహారిక నిర్మిస్తున్న కొత్త సినిమాలో, ‘MAD’ ఫేమ్ సంగీత్ శోభన్ హీరోగా నటిస్తుండగా, నయన్ సరిగా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆమె ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా.. తాజాగా నిహారిక తన ఫిట్‌నెస్, డైట్ ప్లాన్ (Diet Plan) గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “నిత్యం డైట్ ఫాలో అవుతాను అనడం కాదు కానీ, ప్రస్తుతం ఫిట్‌నెస్‌పై ఫోకస్ చేస్తున్నాను. అందుకే నా భోజనంలో ఎక్కువగా మార్పులు చేయకుండా, సింపుల్‌గా & ప్రోటీన్ బేస్‌డ్ ఫుడ్ తీసుకుంటున్నాను. రోజు నా డైట్‌లో గుడ్డు, చికెన్, డైట్ బిర్యానీ తప్పనిసరిగా ఉంటాయి. ఇదే నా హెల్త్ సీక్రెట్” అని చెప్పింది. నిహారిక షేర్ చేసిన ఈ సింపుల్ & హెల్దీ డైట్ ప్లాన్ ఇప్పుడు ఫిట్‌నెస్ లవర్స్‌కు ప్రేరణగా నిలుస్తోంది. నటనలో తనదైన ముద్ర వేయలేకపోయిన నిహారిక, నిర్మాతగా (Producer) మాత్రం మెగా ఫ్యామిలీ పేరుకు తగ్గ ఫలితాలను సాధిస్తూ ముందుకెళ్తోంది. తన తాజా చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంటే, నిర్మాతగా ఆమె స్థానాన్ని మరింత బలపరచుకోవడం ఖాయం.