Homeబిజినెస్​Stock Market | ఎనిమిది సెషన్లుగా నిఫ్టీ పైపైకి.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Stock Market | ఎనిమిది సెషన్లుగా నిఫ్టీ పైపైకి.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic Stock Markets) లాభాల బాటలో పయనిస్తున్నాయి. నిఫ్టీ వరుసగా ఎనిమిదో సెషన్‌లోనూ లాభాలతో ముగిసింది. ఈ క్రమంలో 25 వేల మార్క్‌పైన నిలబడిరది. సెన్సెక్స్‌ ఐదు సెషన్లుగా లాభాలతో కొనసాగుతోంది.

శుక్రవారం ఉదయం సెన్సెక్స్‌ 210 పాయింట్లు, నిఫ్టీ(Nifty) 69 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి. స్వల్ప ఒడిదుడుకులు ఎదురైనా.. స్థిరంగా ముందుకు సాగాయి. సెన్సెక్స్‌ 81,641 నుంచి 81,992 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ 25,038 నుంచి 25,139 పాయింట్ల మధ్యలో ట్రేడ్‌ అయ్యాయి. చివరికి సెన్సెక్స్‌(Sensex) 355 పాయింట్ల లాభంతో 81,904 వద్ద, నిఫ్టీ 108 పాయింట్ల లాభంతో 25,114 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market | మిశ్రమంగా సూచీలు..

ఎఫ్‌ఎంసీఈ, పీఎస్‌యూ బ్యాంక్‌, కన్జూమర్‌ సెక్టార్లు నష్టాల బాటలో పయనించగా.. మిగిలిన సెక్టార్లు రాణించాయి. బీఎస్‌ఈలో ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్‌ 0.70 శాతం, పీఎస్‌యూ బ్యాంక్‌ 0.37 శాతం, కన్జూమర్‌ డ్యూరెబుల్‌ ఇండెక్స్‌ 0.17 శాతం నష్టపోయాయి. క్యాపిటల్‌ గూడ్స్‌(Capital goods) ఇండెక్స్‌ 1.76 శాతం పెరగ్గా.. టెలికాం 0.88 శాతం, మెటల్‌ 0.80 శాతం, పీఎస్‌యూ ఇండెక్స్‌ 0.67 శాతం, క్యాపిటల్‌ మార్కెట్‌ 0.59 శాతం, యుటిలిటీ 0.53 శాతం, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 0.52 శాతం, ఇన్‌ఫ్రా 0.45 శాతం, ఆటో 0.41 శాతం లాభపడ్డాయి. లార్జ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.41 శాతం, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.27 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.09 శాతం లాభాలతో ముగిశాయి.

Stock Market | అడ్వాన్సెస్‌ అండ్‌ డిక్లయిన్స్‌..

బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 2,061 కంపెనీలు లాభపడగా 2,082 స్టాక్స్‌ నష్టపోయాయి. 146 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 135 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 53 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 8 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌ను, 8 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి.

Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 16 కంపెనీలు లాభాలతో ఉండగా.. 14 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. బీఈఎల్‌ 3.67 శాతం, బజాజ్‌ ఫైనాన్స్‌ 3.41 శాతం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 2.38 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.64 శాతం, మారుతి 1.35 శాతం లాభపడ్డాయి.

Top Losers : ఎటర్నల్‌ 2.01 శాతం, హెచ్‌యూఎల్‌ 1.43 శాతం, ట్రెంట్‌ 0.79 శాతం, టైటాన్‌ 0.61 శాతం, ఎయిర్‌టెల్‌ 0.51 శాతం నష్టపోయాయి.