Homeక్రీడలుNicholas Pooran | ఊహించ‌ని నిర్ణ‌యం.. 29 ఏళ్లకే అంత‌ర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై

Nicholas Pooran | ఊహించ‌ని నిర్ణ‌యం.. 29 ఏళ్లకే అంత‌ర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Nicholas Pooran | ఇటీవ‌లి కాలంలో చాలా మంది క్రికెట‌ర్స్ అంత‌ర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెప్పి అభిమానుల‌ని ఎంత‌గానో బాధించారు. రోహిత్ శర్మ‌, విరాట్ కోహ్లీ, మ్యాక్స్‌వెల్, క్లాసెన్ ఇలా ప‌లువురు ప‌లు ఫార్మాట్స్‌కి గుడ్ బై చెప్ప‌గా కొంద‌రు పూర్తిగా క్రికెట్‌కి దూర‌మ‌య్యారు. తాజాగా అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి మరో స్టార్‌ ప్లేయర్‌ తప్పుకున్నాడు. వెస్టిండీస్‌ (Westindies) విధ్వంసక బ్యాటర్‌ మూడు ఫార్మట్లకు వీడ్కోలు పలికి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. 29 ఏండ్ల వయస్సులోనే రిటైర్మెంట్‌ ప్రకటించి క్రికెట్‌ ప్రపంచానికి షాకిచ్చాడు. విండీస్‌ వికెట్‌ కీపర్‌-బ్యాటర్‌ నికోలస్‌ పూరన్‌ (Nicholas Pooran) అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన‌, ఫ్రాంచైజ్‌ క్రికెట్‌లో మాత్రం కొనసాగుతానని వెల్లడించారు.

Nicholas Pooran | ఊహించ‌ని నిర్ణ‌యం..

దక్షిణాఫ్రికా క్రికెటర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ రిటైర్మెంట్‌ ప్రకటించిన కొన్ని రోజుల వ్యవధిలోనే పూరన్‌ అంటర్జాతీయ క్రికెట్‌(International cricket) నుంచి తప్పుకోవడం విశేషం. ఈమేరకు పూరన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో Instagramపోస్టు చేశాడు. ఇది ఎంతో కఠినమైన నిర్ణయమని, అయినప్పటికీ చాలా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నా అని రాసుకొచ్చాడు. రిటైర్మెంట్ తీసుకునే ముందు చాలా ఆలోచించానని, ధ్యానం చేశానని, ఆ తర్వాత ఎంతో భారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని నికోలస్ పూరన్ చెప్పాడు. క్రికెట్ నేను ఎంతో ఇష్ట‌ప‌డే ఆట‌. ఇది నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఇస్తూనే ఉంటుంది. మరచిపోలేని జ్ఞాపకాలు మిగిల్చింది.

వెస్టిండీస్ ప్రజలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించ‌డం గొప్ప అనుభూతి. మెరూన్ రంగు ధరించడం, జాతీయ గీతం ఆలపించేటప్పుడు గ్రౌండ్‌లో నిలబడడం మరిచిపోలేని అనుభూతిగా మిగిలింది. మైదానంలో అడుగు పెట్టిన ప్రతిసారి నా వందశాతం ఇవ్వాలని అనుకుంటాను. ఇలా ఈ ఎక్స్‌పీరియన్స్‌ను మాటల్లో చెప్పడం కష్టం. కెప్టెన్‌గా Captain జట్టుకు నాయకత్వం వహించడం నాకు ఎల్లప్పుడూ గౌరవంగా ఉంటుంది. నాపై చూపిన అమితమైన ప్రేమకు ధన్యవాదాలు, కష్ట సమయాల్లో నావెంటే ఉన్నారంటూ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. విండీస్‌ తరఫున 61 వన్డేలు ఆడిన ఈ లెఫ్ట్‌ హాండ్‌ బ్యాటర్‌ 1983 రన్స్ చేశాడు. వాటిలో 3 సెంచరీలు ఉన్నాయి. 106 టీ20ల్లో 2275 పరుగులు చేశాడు. ఇటీవల ఐపీఎల్ 2025 సీజన్‌లో తన పవర్ ఏంటో చూపించారు. విడీస్‌ టీ20 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన పూరన్‌.. మరో 8 నెలల్లో పొట్టి ప్రపంచకప్‌ ఉండగా తప్పుకోవడం గట్టి ఎదురుదెబ్బేనని చెప్పొచ్చు.