అక్షరటుడే, న్యూఢిల్లీ: Jammu Kashmir : పాక్ ఉగ్రవాదుల తదుపరి దాడుల ప్రణాళికలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. భారత్ రైల్వే మౌలిక సదుపాయాలు, కశ్మీరీ పండిట్లు, కశ్మీర్ లోయలో పనిచేసే స్థానికేతరులే లక్ష్యంగా దాడులు చేయాలని ఉగ్రవాదులు (Terrorist Attack) ప్రణాళికలు వేస్తున్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. పహల్గావ్ ఉగ్రదాడి తర్వాత నిఘా వర్గాలు ఈ విషయాన్ని పసిగట్టినట్లు తెలుస్తోంది.
జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir) లో పనిచేసే స్థానికేతరులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా కశ్మీర్లో పనిచేసే రైల్వే ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారే. ఈ నేపథ్యంలో దాడుల ముప్పు దృష్ట్యా రైల్వే భద్రతా సిబ్బందిని అధికారులు అప్రమత్తం చేశారు. తమ బ్యారక్ల నుంచి బయటకు రాకుండా ఉండాలని సూచించారు.
మరోవైపు కశ్మీరీ పండిట్లే లక్ష్యంగా దాడులు చేసేందుకు పాకిస్తాన్ ఐఎస్ఐ ప్రణాళికలు వేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించినట్లు సమాచారం. వీరితోపాటు శ్రీనగర్, గాందెర్బల్ జిల్లాల్లోని పోలీసు సిబ్బందికి సైతం హెచ్చరికలు జారీ అయ్యాయి. ఉగ్రదాడుల ముప్పు నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.