44
అక్షరటుడే, బోధన్ : Bodhan | బోధన్ నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లను బీజేపీ బోధన్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మేడపాటి ప్రకాశ్‌రెడ్డి (Medapati Prakash Reddy) సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో బోధన్ నియోజకవర్గంలో (Bodhan Constituency) బీజేపీ మద్దతుదారులు ఒక్క సర్పంచ్ కూడా లేరన్నారు. కాగా.. ప్రస్తుతం బీజేపీ మద్దతుదారులు 16 సర్పంచ్ స్థానాల్లో గెలుపొందడం గర్వకారణమన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీకి (BJP) బోధన్ అడ్డాగా మారాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో బోధన్ సాలూర మండల అధ్యక్షుడు శిల్ప సుదర్శన్, గంగాధర్ పాల్గొన్నారు.