53
అక్షరటుడే, వెబ్‌డెస్క్: new year celebrations | న్యూజిలాండ్ దేశం కొత్త ఏడాదిలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ప్రధాన నగరమైన ఆక్లాండ్‌లో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిష్టాత్మక స్కై టవర్‌పై అద్భుతమైన బాణసంచా ప్రదర్శన చేపట్టారు. వర్షం కురిసినప్పటికీ, వేలాది మంది ప్రజలు సమావేశమై ఈ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. వెల్లింగ్టన్ వంటి ఇతర నగరాల్లో కూడా సంబరాలు జరిగాయి.
new year celebrations | ఆస్ట్రేలియాలో..
కొద్దిసేపటి తర్వాత ఆస్ట్రేలియా దేశంలోని సిడ్నీ, మెల్బోర్న్ నగరాల్లో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆ తరువాత తూర్పు ఆసియా ప్రాంతంలోని జపాన్, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా, చైనా, మంగోలియా, తైవాన్ వంటి దేశాలు కొత్త సంవత్సరాన్ని స్వాగతించనున్నాయి.