Nizamabad CP | న్యూఇయర్​ ‘కిక్కు’.. భారీగా కేసులు.. రూ.లక్షల్లో జరిమానాలు

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Nizamabad CP | కొత్త ఏడాదిని ఆహ్వానిస్తూ నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో (Nizamabad Police Commissionerate) పెద్ద ఎత్తున సంబరాలు జరిగాయి. అయితే పోలీసులు సైతం ముందస్తుగా మందుబాబులకు హెచ్చరికలు జారీ చేశారు. డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీలు (drunk driving checks) నిర్వహిస్తామని పట్టుకుంటే భారీ జరిమానాలు వేస్తామని తెలిపారు. Nizamabad CP | అయినా.. మద్యం మత్తులో రోడ్లపైకి.. పోలీసులు హెచ్చరించినప్పటికీ కొందరు వ్యక్తులు మద్యం తాగి దర్జాగా రోడ్లపైకి […]

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Nizamabad CP | కొత్త ఏడాదిని ఆహ్వానిస్తూ నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో (Nizamabad Police Commissionerate) పెద్ద ఎత్తున సంబరాలు జరిగాయి. అయితే పోలీసులు సైతం ముందస్తుగా మందుబాబులకు హెచ్చరికలు జారీ చేశారు. డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీలు (drunk driving checks) నిర్వహిస్తామని పట్టుకుంటే భారీ జరిమానాలు వేస్తామని తెలిపారు.

Nizamabad CP | అయినా.. మద్యం మత్తులో రోడ్లపైకి..

పోలీసులు హెచ్చరించినప్పటికీ కొందరు వ్యక్తులు మద్యం తాగి దర్జాగా రోడ్లపైకి వచ్చారు. ఈ మేరకు కమిషనరేట్​ పరిధిలోని నిజామాబాద్​, ఆర్మూర్​, బోధన్​ డివిజన్​ ట్రాఫిక్​ పోలీస్​స్టేషన్ల పరిధిలో పోలీసులు డిసెంబర్​ 29వ తేదీ నుంచి 31వరకు తనిఖీలు నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు.

Nizamabad CP | జిల్లావ్యాప్తంగా 102 కేసులు..

ఈ మేరకు సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) మాట్లాడుతూ.. మూడురోజుల్లో జిల్లావ్యాప్తంగా 102 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. పోలీసుల అదుపులో ఉన్నవారిని కోర్టులో హాజరుపర్చగా రూ.9,50,000 జరిమానాలు సైతం విధించారని ఆయన వివరించారు. అందులో ఏడుగురికి వారంరోజుల పాటు జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిందని పేర్కొన్నారు.

Nizamabad CP | మద్యంతాగి రోడ్లపైకి రావొద్దు..

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ప్రజలు మద్యం తాగి రోడ్లపైకి రావొద్దని సూచించారు. అలాగే వాహనదారులు సరైన ధ్రువపత్రాలు దగ్గర ఉంచుకుని వాహనాలు నడపాలన్నారు. సంబంధిత అధికారులు చెకింగ్​ చేసినప్పుడు పత్రాలు చూపించాలని కోరారు.

Related articles

Modi Launches Namo Bharat | తొలి హైస్పీడ్​ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Modi Launches Namo Bharat | ఉత్తర ప్రదేశ్​లోని మీరట్​లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆదివారం...

Eco Run 2.0: మాదాపూర్‌లో మైండ్‌స్పేస్ ఈకో రన్ 2.0 సందడి.. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా 4,200 మంది పరుగు

హైదరాబాద్: ఐటీ హబ్ మాధాపూర్‌లో ఆదివారం ఉదయం పరుగు ఉత్సాహం ఉప్పొంగింది. మైండ్‌స్పేస్ REIT, మిర్చి సంయుక్తంగా నిర్వహించిన మైండ్‌స్పేస్ ఈకో రన్ 2.0...

Yendala Arrest | యెండల లక్ష్మీనారాయణ అరెస్ట్

అక్షరటుడే, బాన్సువాడ : Yendala Arrest | బాన్సువాడ (Banswada) పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణల్లో గాయపడిన కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్తున్న బాన్సువాడ నియోజకవర్గ...

Harish Rao Criticizes Revanth | సీఎం చేసిందేమి లేదు.. కూల్చిందే ఎక్కువ : హరీశ్​రావు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao Criticizes Revanth | కాంగ్రెస్​ ప్రభుత్వం, సీఎం రేవంత్​రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్​రావు విమర్శలు చేశారు. రెండేళ్ల...