అక్షరటుడే, వెబ్డెస్క్: Hyderabad | హైదరాబాద్ నగరంలో న్యూ ఇయర్ వేడుకలు (New Year celebrations) ఘనంగా జరుపుకుంటారు. ఈ వేడుకల్లో డ్రగ్స్ కూడా వినియోగించే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు.
కొత్త సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ వాడకుండా చూస్తామని నగర సీపీ సజ్జనార్ (Police Commissioner Sajjanar) ఇప్పటికే ప్రకటించారు. ఈ మేరకు గత నాలుగైదు రోజులుగా పోలీసులు, ఈగల్ టీమ్ (Eagle Team), హెచ్ న్యూ విభాగం, ఎక్సైజ్ అధికారులు నగరంలో జోరుగా తనిఖీలు చేపడుతున్నారు. డ్రగ్స్ విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. తాజాగా బాలాపూర్ పరిధిలో డ్రగ్స్ పట్టుకున్నారు. MDMA అమ్ముతున్న యువకుడి అరెస్ట్ చేశారు. అతడి నుంచి 1.6 గ్రాముల MDMA స్వాధీనం చేసుకున్నారు. ఈజీ మనీ కోసం బెంగళూరు నుంచి డ్రగ్ తీసుకొచ్చి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.
Hyderabad | వంట మనిషి దగ్గర గంజాయి
మాదాపూర్లోని ఓ హోటల్లో పోలీసులు గంజాయి పట్టుకున్నారు. వంటమనిషి అభిలాష్ దగ్గర 3.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. హోటల్ కస్టమర్లకు గంజాయి విక్రయిస్తున్నట్టు అనుమానం వ్యక్తం చేశారు. సైబరాబాద్ (Cyberabad) పరిధిలోని మియాపూర్ ఎక్స్ రోడ్ సమీపంలో ఇద్దరు డ్రగ్స్ స్మగ్లర్లను పట్టుకుని, 10.5 గ్రాముల ఎండీఎంఏను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Hyderabad | ముంబై నుంచి..
ఇద్దరు వ్యక్తులు ఎండీఎంఏ విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడులు చేశారు. నిందితులు ముంబై నుంచి ఈ నెల 27 ఎండీఎంఏ తీసుకొచ్చారు. నూతన సంవత్సర వేడుకల సమయంలో హైదరాబాద్లో దీనిని విక్రయించి డబ్బు సంపాదించాలని ప్లాన్ వేశారు. అరెస్టు అయిన వారిని మేస్త్రీ కేతావత్ రవి (28), ఆటో డ్రైవర్ జెర్పుల రవి (35)గా గుర్తించారు. వీరిద్దరూ మహారాష్ట్రకు చెందినవారు.