41
అక్షరటుడే, ఇందూరు: New Year celebrations | కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ నిజామాబాద్ జిల్లాలో ప్రజల సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇందూరు నగరంలో యువత వీధుల్లో కేకులు కోస్తూ.. బాణ సంచా కాల్చుతూ నూతన సంవత్సరాన్ని స్వాగతించారు. నిజామాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. 
New Year celebrations | కేకు కోసి..
పోలీస్ కమిషనరేట్ సాయి చైతన్య కేకు కోసి తోటి పోలీసు అధికారులకు తినిపించారు. ఒకరినొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. 


