అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Cyber Crime | సైబర్ నేరస్తులు రెచ్చిపోతున్నారు. రోజు రోజుకు కొత్త మార్గాల్లో ప్రజల ఖాతాల్లో నుంచి డబ్బులు లూటీ చేస్తున్నారు. మొన్నటి వరకు ఖాతాల్లో డబ్బులు కాజేసిన సైబర్ నేరగాళ్లు ప్రస్తుతం క్రెడిట్ కార్డుల్లో నగదు కూడా తీసుకుంటున్నారు. అంతేగాకుండా ఫిక్స్‌డ్ డిపాజిట్ల (Fixed Deposits)ను క్యాన్సిల్ చేసి ఆ డబ్బును సైతం మాయం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ (Hyderabad) నగరంలోని ఓ యువకుడి ఖాతాలో నుంచి రూ.7 లక్షలు కాజేశారు.
సికింద్రాబాద్‌లోని తార్నాక (Tarnaka)కు చెందిన ఓ యువకుడి(27)కి జులై 25న గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. తాము బ్యాంకు నుంచి ఫోన్ చేసినట్లు చెప్పాడు. ఫిక్స్‌డ్ డిపాజిట్ల ఆటో రెన్యూవల్ అవతలి వ్యక్తి చెబుతున్నాడు. ఈ సమయంలో లింక్‌తో కూడిన ఎస్ఎంఎస్ బాధితుడి నంబర్‌కు వచ్చింది. అనంతరం imobilete.apk అనే ప్రమాదకరమైన యాప్ ఫోన్లో డౌన్లోడ్ అయింది.
Cyber Crime | రూ.7 లక్షలు మాయం
ఫోన్లో యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత బాధితుడి అనుమతి లేకుండానే.. సైబర్ నేరగాళ్లు ఫోన్‌ను యాక్సెస్ చేయడం ప్రారంభించారు. అంతేగాకుండా ఫిక్స్‌డ్ డిపాజిట్లు మూసివేశారు. ఆ నగదును వారు బదిలీ చేసుకున్నారు. క్రెడిట్ కార్డుల నుంచి సైతం నగదు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఇలా మొత్తం రూ.7,05,049 సైబర్ నేరగాళ్లు కొట్టేశారు. ఖాతాలో డబ్బులు కట్ కావడంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసుల (Cyber Crime Police)కు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Cyber Crime | అప్రమత్తంగా ఉండాలి
సైబర్ నేరాల (Cyber Frauds)పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎవరు ఊరికే ఎవరూ గిఫ్ట్‌లు ఇవ్వరని, అలాంటి వారి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. గుర్తు తెలియని వ్యక్తుల సందేశాలకు స్పందించవద్దని సూచించారు. అలాగే ఎవరైనా ఫోన్ చేసి తాము పోలీసులం, సీబీఐ అధికారులమని(CBI Officers) చెప్పి బెదిరిస్తే భయపడకుండా ఉండాలన్నారు. అధికారులు అలా ఫోన్లు చేయరని చెప్పారు. అలాగే గుర్తు తెలియని వ్యక్తులకు బ్యాంకు వివరాలు చెప్పొద్దని, ఏపీకే ఫైళ్లు డౌన్లోడ్ చేసుకోవద్దని సూచిస్తున్నారు. ఒకవేళ సైబర్ నేరానికి గురైతే.. వెంటనే 1930 నంబర్‌కు ఫోన్ చేయాలని కోరారు.