అక్షరటుడే, వెబ్‌డెస్క్ : New Toll Policy | దేశంలో త్వరలో కొత్త టోల్ వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Union Minister Nitin Gadkari) తెలిపారు. ఇప్పటికే పది చోట్ల ప్రవేశ పెట్టిన నూతన విధానాన్ని ఏడాదిలో దేశం అంతటా విస్తరిస్తామన్నారు.
లోక్‌సభ సమావేశాల్లో (Loksabha Sessions) భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో గడ్కరీ మాట్లాడారు. ప్రస్తుత టోల్ వసూలు వ్యవస్థ ఏడాదిలోపే కనుమరుగవుతుందన్నారు. కొత్త విధానంలో ఉపగ్రహాల సాయంతో టోల్ కట్ చేస్తారన్నారు. దీంతో టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. ఆటోమేటిగ్గా టోల్ రుసుము చెల్లించేలా కొత్త వ్యవస్థ ఉంటుందన్నారు.
New Toll Policy | ఎవరు ఆపరు
ఈ టోల్ వ్యవస్థ ముగుస్తుందని, టోల్ పేరుతో వాహనాలను ఆపడానికి ఎవరూ ఉండరని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఏడాదిలోపు దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ టోల్ వసూళ్లను (Electronic Toll Collection) అమలు చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రూ.10 లక్షల కోట్ల విలువైన 4,500 హైవే ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని చెప్పారు. హైవే వినియోగదారులకు సజావుగా ఉండేలా ప్రస్తుత సాధనాల సేకరణ వ్యవస్థను ఎలక్ట్రానిక్ టోల్ వసూలు వ్యవస్థ భర్తీ చేస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.
టోల్ వసూళ్లను క్రమబద్ధీకరించడానికి, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ వసూళ్లను (NETC) ప్రోగ్రామ్‌గా అభివృద్ధి చేసింది. ఇది ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపుల కోసం ఏకీకృత, ఇంటర్ ఆపరబుల్ ప్లాట్‌ఫామ్. ఈ వ్యవస్థలో ప్రధానమైనది ఫాస్ట్‌ట్యాగ్. ఇది వాహనం విండ్‌స్క్రీన్‌కు జోడించబడిన రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (Radio Frequency Identification) పరికరం. ఈ సాంకేతికత వినియోగదారు లింక్డ్ ఖాతా నుంచి ఆటోమేటిక్ టోల్ చెల్లింపులు జరుగుతాయి.
