HomeతెలంగాణHyderabad | హైదరాబాద్​లో కొత్తగా స్టార్​ హోటళ్లు

Hyderabad | హైదరాబాద్​లో కొత్తగా స్టార్​ హోటళ్లు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​:Hyderabad | హైదరాబాద్​ నగరం రోజు రోజుకు విస్తరిస్తోంది. అందుకు తగ్గట్లు ప్రభుత్వాలు కూడా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాయి. అంతేగాకుండా నగరంలో అంతర్జాతీయ స్థాయి ఐటీ పరిశ్రమలు నెలకొని ఉన్నాయి. కొత్తగా పలు పరిశ్రమలు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పర్యాటకంగా కూడా నగరంలో చూడదగ్గ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. దీంతో హైదరాబాద్(Hyderabad)​ నగరానికి దేశ విదేశాల నుంచి ఎంతో మంది వస్తుంటారు.

ఈ నేపథ్యంలో నగరంలో ఆథిత్య రంగం అభివృద్ధి చెందుతోంది. నగరానికి వచ్చే పర్యాటకులు, అతిథుల కోసం కొత్తగా స్టార్ హోటళ్లు(Star Hotels) రానున్నాయి.భాగ్యనగరంలో రానున్న ఐదేళ్లలో 25 వరకు స్టార్‌ హోటళ్లు, రిసార్టులు ఏర్పాటు కానున్నాయి. అంతర్జాతీయంగా పేరున్న పలు హోటళ్లు, దేశీయంగా ఆతిథ్య రంగంలో ఉన్న సంస్థలు కొత్త ప్రాంతాల్లో విస్తరించేందుకు డెవలపర్లతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఆయా హోటళ్లు ఎక్కువగా ఐటీ కారిడార్‌లో, శంషాబాద్‌ విమానాశ్రయ(Shamshabad Airport) మార్గం, శామీర్‌పేట ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో 2032 నాటికి వీటిలో ఐదు వేలకుపైగా గదులు కొత్తగా అందుబాటులోకి రానున్నాయి.

Hyderabad | అంతర్జాతీయ స్థాయి ఈవెంట్లతో ఖ్యాతి

హైదరాబాద్​ ఇప్పటికే ఐటీ, ఫార్మా రంగాలకు కేంద్రంగా ఉంది. నగర ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడానికి ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా ఇటీవల మిస్​ వరల్డ్​ పోటీలు(Miss World competitions) నిర్వహించారు. దీంతో వివిధ దేశాలకు చెందిన పోటీదారులు, ఇతర ప్రముఖులు వందల సంఖ్యలో ఇక్కడికి వచ్చారు. గతంలో జీ-20 సదస్సు తదితర కార్యక్రమాలు కూడా నగరంలో నిర్వహించారు. అంతర్జాతీయ స్థాయి ఈవెంట్లతో నగరంలో ఆతిథ్యరంగం విస్తరిస్తోంది. దీంతో కొత్తగా హోటళ్లు ఏర్పాటు చేయడానికి కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి.