అక్షరటుడే నిజామాబాద్ సిటీ: CP Sai chaitanya | పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో నియమితులైన ఎస్సైలు మంగళవారం సీపీ సాయిచైతన్యను కలిశారు. కమిషనరేట్ కార్యాలయంలో(Commissionerate Office) మంగళవారం సీపీని కలిసి పూలమొక్కలను అందజేశారు.
CP Sai chaitanya | విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉండాలి..
అనంతరం పోలీస్ కమిషనర్ సాయిచైతన్య మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా నిక్కచ్చిగా వ్యవహరించాలన్నారు. తాము పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని సూచించారు. సీపీని కలిసిన వారిలో మోపాల్ ఎస్సై సుస్మిత, ధర్పల్లి ఎస్సై కళ్యాణి, ఎడపల్లి ఎస్సై రమ, బాల్కొండ ఎస్సై శైలేందర్, మెండోరా ఎస్సై సుహాసిని, ఎరుగట్ల ఎస్సై రాజేశ్వర్, మూడో టౌన్ ఎస్సై కిరణ్ పాల్ ఉన్నారు.