HomeతెలంగాణIndira Saura Giri Jal Vikasam scheme | తెలంగాణలో కొత్త పథకం.. అర్హులు వీరే

Indira Saura Giri Jal Vikasam scheme | తెలంగాణలో కొత్త పథకం.. అర్హులు వీరే

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్: Indira Saura Giri Jal Vikasam scheme : తెలంగాణ రాష్ట్రం(Telangana state) లో మరో కొత్త పథకం(new scheme) రాబోతోంది. ఇందిర సౌర గిరి జల వికాసం పథకానికి రాష్ట్ర సర్కారు అంకురార్పణ చేయబోతోంది. ఈ పథకాన్ని రేపు(మే 19) ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి(Chief Minister Revanth Reddy) ప్రారంభించనున్నారు. దీని కింద సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేసి, సాగునీటిని అందిస్తారు.

RoFR(అటవీ హక్కుల చట్టం-2006)(Forest Rights Act-2006) భూములు కలిగి ఉన్న గిరిజన రైతులే (tribal farmers) దీనికి అర్హులు. 2.5 ఎకరాలు లేదా అంతకు మించి ఉన్నవారికి ఒకే యూనిట్ మంజూరు చేస్తారు. 2.5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉంటే.. ఇతర రైతులతో కలిపి యూనిట్​గా పరిగణిస్తారు. యూనిట్ ఖర్చు రూ.6 లక్షలు మించకూడదనేది నియమం.