అక్షరటుడే, వెబ్‌డెస్క్: Panchayat funds | రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు (Panchayat elections) ముగిశాయి. కొత్త పాలకవర్గాలు (New governing bodies) కొలువు దీరాయి. ఈ క్రమంలో ప్రభుత్వం నిధుల నిర్వహణకు నిబంధనలు జారీ చేసింది.
రాష్ట్రంలో దాదాపు 22 నెలల తర్వాత గ్రామాలకు సర్పంచులు (Sarpanches) వచ్చారు. ఇన్ని రోజులు సర్పంచులు లేక ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోయాయి. నిధులు లేకపోవడంతో పంచాయతీ కార్యదర్శులు పనులు చేయించలేదు. దీంతో కొత్తగా వచ్చిన సర్పంచులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం పంచాయతీ నిధుల (Panchayat funds) వినియోగం కోసం నిబంధనలు జారీ చేసింది. 15వ ఆర్థిక సంఘం (XV-FC), రాష్ట్ర గ్రాంట్ల (SFC) నిధుల వినియోగంలో ఇకపై మాన్యువల్ చెల్లింపులు చెల్లవని స్పష్టం చేసింది. అన్నీ PFMS, ఇ-గ్రామ్ స్వరాజ్ పోర్టల్ ద్వారానే జరగాలని తెలిపింది.
Panchayat funds | ప్రత్యేక ఖాతాలు తెరవాలి
ప్రతి గ్రామ పంచాయతీ/మండల పరిషత్ (Gram Panchayat/Mandal Parishad) పేరు మీద 15వ ఆర్థిక సంఘం నిధులకు ఒకటి, రాష్ట్ర వాటా గ్రాంట్లకు మరొకటి చొప్పున ప్రత్యేక బ్యాంకు ఖాతాలను తెరవాలి. ఇతర పథకాల నిధులను వీటితో కలపకూడదు. చెల్లింపుల ఆమోదానికి రెండు అంచెల వ్యవస్థ ఉంటుంది. ఉపసర్పంచ్ లేదా ఎంపీడీవో బిల్లుల వోచర్ తయారు చేస్తారు. సర్పంచ్ లేదా ఎంపీపీ దానికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది.
Panchayat funds | గ్రామసభ తీర్మానం ఉండాలి
గ్రామంలో పనుల కోసం గ్రామసభ తీర్మానం తప్పనిసరిగా ఉండాలి. కొత్త పంచాయతీలు LGD కోడ్‌తో PFMSలో నమోదు చేసుకోవాలి. విక్రేతలు (Vendors) కూడా పోర్టల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. నిధుల పారదర్శకత కోసం ప్రభుత్వం పూర్తిస్థాయిలో డిజిటల్ పర్యవేక్షణను, సర్పంచ్-ఉపసర్పంచ్‌ల ఉమ్మడి డిజిటల్ ఆమోదాన్ని అమలులోకి తెచ్చింది.