అక్షరటుడే, వెబ్‌డెస్క్: Tatkal Booking | రైల్వే ప్రయాణికులకు అలర్ట్. తత్కాల్ టిక్కెట్ బుకింగ్‌కి (Tatkal ticket booking) సంబంధించి ఓ కీలక మార్పు జరగబోతోంది. ఇందుకు సంబంధించి ఇండియన్ రైల్వే శాఖ(Indian Railways) తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు మరింత భద్రతను అందించడమే లక్ష్యంగా ఈ చర్య చేపట్టినట్లు తెలుస్తోంది. జులై 1, 2025 నుంచి తత్కాల్ టికెట్ బుక్ చేయాలంటే తప్పనిసరిగా ఆధార్ వెరిఫైడ్ యూజర్(Aadhaar Verified User) కావాల్సిందే. IRCTC యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా తత్కాల్ టికెట్ బుక్ చేసుకునే వారు తమ ఖాతాను ఆధార్‌తో అనుసంధానించి వెరిఫై చేయాలి.
Tatkal Booking | ఇది తప్పనిసరి..
సుదీర్ఘ ప్రయాణాలకు రైల్వే సేవలు కీలకంగా ఉండడంతో, తత్కాల్ టికెట్ బుకింగ్‌లో (Tatkal ticket booking) పారదర్శకతను పెంచే దిశగా ఈ మార్పులు తీసుకొస్తున్నారు. 2025 జూలై 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఇప్పటివరకు సాధారణంగా IRCTC లాగిన్ ఉన్న ఏ ప్రయాణికుడైనా తత్కాల్ టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడలా కాదు. తత్కాల్ టికెట్ బుకింగ్‌లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. జూలై 1, 2025 నుండి తత్కాల్ టికెట్లు IRCTC వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా బుక్ చేయాలంటే, యూజర్ ఆధార్ వెరిఫైడ్ అయి ఉండాలి.
జూలై 15, 2025 నుంచి, తత్కాల్ టికెట్ బుక్ చేసే సమయంలో ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌కు పంపబడే OTPని నిర్ధారణ చేయడం తప్పనిసరి. ఈ మార్పులు టికెట్ బ్లాక్ మార్కెట్(Ticket Black Market)ను అడ్డుకునేందుకు, మరింత పారదర్శకత కల్పించేందుకు తీసుకువస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఆధార్ వెరిఫికేషన్ పూర్తిచేసుకున్న యూజర్లకు బుకింగ్ సమయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు ఇప్పుడే IRCTC అకౌంట్‌ను ఆధార్‌తో లింక్ చేసుకుని వెరిఫై చేసుకోవచ్చు. తద్వారా జూలై నుంచి కొత్త నిబంధనల ప్రకారం మీరు సులభంగా బుకింగ్ చేసుకోవడం వీలవుతుంది.