అక్షరటుడే, ఇందూరు: Railway Line | జిల్లాలోని రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం(Central Government) గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే జిల్లా మీదుగా పలు ప్రాంతాలకు రైళ్ల రాకపోకలు సాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆర్మూర్ మీదుగా మరో రైల్వే లైన్(Railway Line) మంజూరు చేస్తూ.. రైల్వేశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
పటాన్చెరు నుంచి ఆర్మూర్(Patancheru to Armur) మీదుగా ఆదిలాబాద్ వరకు కొత్త రైల్వే లైన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిజామాబాద్‌లో రైల్వే సౌకర్యాలు.. దాని విస్తరణకు సంబంధించి మరో ప్రాజెక్ట్‌కు ముందడుగు పడింది. పటాన్చెరు, ఆదిలాబాద్ మధ్య ఆర్మూర్ మీదుగా రైల్వేలైన్ వేయాలని గత రెండేళ్లుగా ఎంపీ అర్వింద్ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్(Railway Minister Ashwini Vaishnav)ను పలుమార్లు కోరారు. తాజాగా ఈ ప్రాజెక్టు మంజూరు చేసినట్లు రైల్వే మంత్రి ఎంపీ అర్వింద్(MP Aravind)కు లేఖ రాశారు.
Railway Line | డీపీఆర్ తయారీ
ఈ ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ తయారు చేస్తున్నట్లు తెలిసింది. డీపీఆర్ పూర్తయిన తర్వాత తదుపరి చర్యలు చేపడతామని లేఖలో పేర్కొన్నారు. కాగా, తన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి ఉత్తర తెలంగాణలో ముఖ్యమైన నూతన రైల్వే లైన్ మంజూరు చేసినందుకు ఎంపీ అర్వింద్ కేంద్రమంత్రి(Union Minister)కి కృతజ్ఞతలు తెలిపారు.
Railway Line | ఎంపీ అర్వింద్ కృషి
పటాన్చెరు నుంచి ఆదిలాబాద్ వరకు ఆర్మూర్ మీదుగా రైల్వే లైన్ మంజూరు చేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్రంగా కృషి చేశారు. ఈ మేరకు పలుమార్లు ఆయన రైల్వేశాఖ మంత్రిని కలిసి విన్నవించారు. ఈ క్రమంలో తాజాగా రైల్వేశాఖ మంత్రి రైల్వే లైన్ మంజూరు చేశారు. అంతేగాకుండా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఆర్వోబీల నిర్మాణం విషయంలో సైతం ఎంపీ తీవ్రంగా కృషి చేశారు. ఈ క్రమంలో పలు ఆర్వోబీల నిర్మాణం పూర్తి కాగా.. కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి.
Railway Line | ప్రయాణికుల కోసం వసతుల కల్పన
రాష్ట్రంలో నిత్యం ఎంతో మంది రైళ్లలో రాకపోకలు సాగిస్తారు. దీంతో కేంద్ర ప్రభుత్వం రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం అనేక చర్యలు చేపడుతోంది. ఇప్పటికే వేగంగా వెళ్లడానికి పలు మార్గాల్లో వందే భారత్ రైళ్లను రైల్వే శాఖ(Railway Department) నడుపుతోంది. అలాగే రద్దీ అధికంగా ఉన్న మార్గాల్లో ప్రత్యేక రైళ్లను సైతం వేస్తోంది. అంతేగాకుండా అమృత్ భారత్ స్కీమ్‌లో భాగంగా రైల్వే స్టేషన్లను ఆధునిక హంగులతో పునరుద్ధరిస్తోంది. నిజామాబాద్, కామారెడ్డి రైల్వే స్టేషన్లలో ఆధునికీకరణ పనులు వేగంగా సాగుతున్నాయి. తాజాగా కేంద్రం పటాన్చెరు నుంచి ఆర్మూర్ మీదుగా ఆదిలాబాద్ వరకు రైల్వే లైన్ మంజూరు చేసింది. దీంతో ఈ మార్గంలో ఉన్న గ్రామాలు అభివృద్ధి చెందనున్నాయి. కేంద్ర నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.