అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Vivo X300 | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ అయిన వీవో భారత స్మార్ట్ ఫోన్ (Smart Phone) మార్కెట్లోకి నూతన మోడల్‌ను రిలీజ్ చేసింది. ప్రీమియం సిరీస్‌లో భాగంగా వీవో ఎక్స్ 300 పేరుతో తీసుకువచ్చిన ఈ ఫోన్.. ఫ్లిప్‌కార్ట్ (Flipkart)తో పాటు వివో ఇండియా అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంది. అదిరే ఫీచర్లతో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన వీవో ఎక్స్ 300పై పది శాతం వరకు తక్షణ డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. ఈ మోడల్ ధర, ఫీచర్లు తెలుసుకుందామా..
డిస్ప్లే : 6.31 ఇంచ్ 1.5k ఎల్టీపీవో ఓఎల్ఈడీ డిస్ ప్లే అమర్చారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్ 10 ప్లస్ సపోర్ట్, 1216 * 2640 పిక్సల్స్ రిజల్యూషన్, IP68, IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉంది.
సాఫ్ట్వేర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ఎస్వోసీ ప్రాసెసర్ అవర్చారు. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 16 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది.
Vivo X300 | కెమెరా సెటప్
వెనకవైపు 200 మెగా పిక్సెల్(MP) సాంసంగ్ హెచ్‌పీబీ మెయిన్ కెమెరాతో పాటు 50 మెగా పిక్సెల్ పెరిస్కోప్ టెలీఫొటో లెన్స్, 50 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెట్ అప్ కలిగి ఉంది. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50 మెగా పిక్సెల్ కెమెరా
బ్యాటరీ సామర్థ్యం : 6040 mAh బ్యాటరీ అమర్చిన ఈ మోడల్ ఫోన్.. 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌ను, 40 వాట్ వైర్లెస్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
Vivo X300 | వేరియంట్స్
ఈ ఫోన్ మూడు వేరియంట్లలో లభిస్తోంది. ఎలైట్ బ్లాక్, మిస్ట్ బ్లూ, సమ్మిట్ రెడ్ కలర్స్‌లో అందుబాటులో ఉంది.
12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 75,999.
12 జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ. 81,999.
16 జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ. 85,999.
కార్డ్ ఆఫర్స్ : ఎంపిక చేసిన బ్యాంక్‌ల క్రెడిట్ కార్డులతో ఈఎంఐ, నాన్ ఈఎంఐ ట్రాన్జాక్షన్స్పై పది శాతం వరకు తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. యూపీఐ లావాదేవీలపైనా ఈ ఆఫర్ వర్తిస్తుంది.