Homeబిజినెస్​Xiaomi 17 Pro Max | డ్యుయల్‌ డిస్‌ప్లేతో సరికొత్త ఫోన్‌.. లాంచింగ్‌కు సన్నాహాలు చేస్తున్న...

Xiaomi 17 Pro Max | డ్యుయల్‌ డిస్‌ప్లేతో సరికొత్త ఫోన్‌.. లాంచింగ్‌కు సన్నాహాలు చేస్తున్న షావోమీ

షావోమీ సరికొత్త ప్రీమియం 5జీ స్మార్ట్‌ ఫోన్‌ను భారత్‌ మార్కెట్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 17 సిరీస్‌లో భాగంగా మూడు మోడళ్లను విడుదల చేయనుంది. ఇందులో 17 ప్రో మాక్స్‌ భారీ బ్యాటరీ, డ్యుయల్‌ డిస్‌ప్లేలతో వస్తోంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Xiaomi 17 Pro Max | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్స్‌ (Smart Phone) తయారీ కంపెనీ అయిన షావోమీ.. ప్రీమియం సెగ్మెంట్‌లో ఇటీవల చైనాలో నూతన మోడళ్లను లాంచ్‌ చేసింది. షావోమీ 17, షావోమీ 17 ప్రో, షావోమీ 17 ప్రో మాక్స్‌(Xiaomi 17 Pro Max) వేరియంట్స్‌ లాంచ్‌ అయ్యాయి.

వీటిని త్వరలో భారత మార్కెట్‌లోనూ విడుదల చేయడానికి ఆ సంస్థ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో షావోమీ 17 ప్రో మాక్స్‌ 7500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 100డబ్ల్యూ ఫాస్ట్‌ చార్జింగ్‌, డ్యూయల్‌ స్క్రీన్స్‌ వంటి అద్భుత ఫీచర్లతో రానుంది. చైనా (China)లో విడుదల చేసిన షావోమీ 17 ప్రో మాక్స్‌ మోడల్‌ ఫీచర్స్‌ ఇలా ఉన్నాయి.

డిస్‌ప్లే : 6.9 ఇంచ్‌ ఎల్‌టీపీవో(LTPO) అమోలెడ్‌ ప్రైమరీ డిస్‌ప్లేతోపాటు 2.9 ఇంచ్‌ ఎల్‌టీపీవో అమోలెడ్‌ సెకండరీ డిస్‌ప్లే ఉన్నాయి. హెచ్‌డీఆర్‌ 10+ సపోర్ట్‌ చేసే ఈ మోడల్‌ ఫోన్‌.. 120 హెడ్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌, 1200 * 2608 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, డ్రాగన్‌ క్రిస్టల్‌ గ్లాస్‌ ప్రొటెక్షన్‌, ఐపీ68/ఐపీ 69 వాటర్‌ అండ్‌ డస్ట్‌ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది.

సాఫ్ట్‌వేర్‌ : క్వాల్‌ కామ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 8 ఎలైట్‌ జెన్‌ 5 ప్రాసెసర్‌తో వస్తున్న ఈ ఫోన్‌.. ఆండ్రాయిడ్‌ 16 ఆపరేటింగ్‌ సిస్టం ఆధారిత Hyper OS 3.0 తో పనిచేస్తుంది.

కెమెరా : వెనకవైపు 50 మెగాపిక్సెల్‌(MP) మెయిన్‌ కెమెరాతో పాటు 50 మెగాపిక్సెల్‌ అల్ట్రా వైడ్‌ కెమెరా, 50 మెగాపిక్సెల్‌ టెలీ ఫొటో లెన్స్‌తో కూడిన ట్రిపుల్‌ కెమెరా సెట్‌ అప్‌(Triple Camera Setup), ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 50 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా ఉన్నాయి.

బ్యాటరీ : 7500 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఈ ఫోన్‌.. 100w ఫాస్ట్‌ చార్జింగ్‌, 50w వైర్‌లెస్‌ చార్జింగ్‌ను సపోర్ట్‌ చేస్తుంది. యూఎస్బీ టైప్‌-సీ పోర్ట్‌ కలిగి ఉంది.

వేరియంట్స్‌ : బేస్‌ వేరియంట్‌ 12 జీబీ ర్యామ్‌, 512 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర 5999 చైనీస్‌ యువాన్స్‌ ఉంది. భారత కరెన్సీలో సుమారు రూ. 75 వేలు.
16 జీబీ ర్యామ్‌, 512 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ధర 6299 చైనీస్‌ యువాన్స్‌. అంటే మన కరెన్సీలో సుమారు రూ. 79 వేలు.
16 జీబీ ర్యామ్‌, 1 టీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ధర 6999 చైనీస్‌ యువాన్స్‌.. మన కరెన్సీలో సుమారు రూ. 87 వేలు.

కలర్స్‌ : బ్లాక్‌, వైట్‌, పర్పుల్‌, గ్రీన్‌ కలర్స్‌లో లభిస్తుంది.