HomeజాతీయంGujarat Cabinet | గుజరాత్​లో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం.. రవీంద్ర జడేజా సతీమణికి కేబినెట్​లో చోటు

Gujarat Cabinet | గుజరాత్​లో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం.. రవీంద్ర జడేజా సతీమణికి కేబినెట్​లో చోటు

Gujarat Cabinet | గుజరాత్​ మంత్రివర్గాన్ని బీజేపీ హైకమాండ్​ పునర్​ వ్యవస్థీకరించింది. పలువురు కొత్త వారికి మంత్రులుగా అవకాశం కల్పించింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gujarat Cabinet | గుజరాత్​ మంత్రివర్గాన్ని శుక్రవారం పునర్​ వ్యవస్థీకరించారు. ఇందులో భాగంగా భారత క్రికెటర్​ రవీంద్ర జడేజా సతీమణి రివాబా జడేజా (Rivaba Jadeja)ను మంత్రి పదవి వరించింది.

గుజరాత్​ మంత్రులు (Gujarat Ministers) అందరు గురువారం రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. గతంలో 16 మంది మంత్రులు ఉండగా.. వారు సీఎంకు రాజీనామా పత్రాలు అందజేశారు. బీజేపీ హైకమాండ్​ కొత్త మంత్రులను ఎంపిక చేసింది. శుక్రవారం వారు ప్రమాణస్వీకారం చేశారు. ఇందులో భాగంగా మజురా ఎమ్మెల్యే హర్ష్ సంఘవి ఉప ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ముఖ్యమంత్రితో కలిసి మంత్రివర్గంలో 26 మంది సభ్యులు ఉన్నారు. గుజరాత్​లో ఎమ్మెల్యేల సంఖ్య 182. దీని ప్రకారం.. మంత్రి వర్గంలో 27 మంది ఉండొచ్చు. ప్రస్తుతం 26 మందికి అవకాశం కల్పించడం గమనార్హం. గుజరాత్ గవర్నర్ (Gujarat Governor) ఆచార్య దేవవ్రత్ 25 మంది మంత్రివర్గ సభ్యులతో ప్రమాణం చేయించారు.

Gujarat Cabinet | పాతవారికి అవకాశం

గతంలో మంత్రులుగా ఉన్న పలువురికి మరోసారి బీజేపీ అవకాశం కల్పించింది. కొందరిని తొలగించింది. అయితే శాఖలు మాత్రం మార్చింది. ఆరోగ్యం, విద్య, న్యాయ శాఖలను నిర్వహించిన విస్నగర్ ఎమ్మెల్యే రుషికేష్ పటేల్, అసెంబ్లీ వ్యవహారాల సహాయ మంత్రి కామ్రేజ్ ఎమ్మెల్యే ప్రఫుల్ పన్షేరియా, జలవనరుల మంత్రిగా ఉన్న జస్దాన్ ఎమ్మెల్యే కున్వర్జీ బవాలియా తిరిగి మంత్రి మండలికి నియమితులయ్యారు. ఆర్థిక, ఇంధన, పెట్రోకెమికల్స్ శాఖను నిర్వహించిన కనుభాయ్ దేశాయ్, మత్స్యకార శాఖ సహాయ మంత్రి పర్షోత్తం సోలంకికి కూడా మళ్లీ అవకాశం కల్పించారు.

Gujarat Cabinet | రివాబా జడేజా నేపథ్యం

రవీంద్ర జడేజా (Ravindra Jadeja) భార్య రివాబా జడేజా శుక్రవారం క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె 1990 నవంబర్ 2న జన్మించారు. జామ్​నగర్​ నుంచి ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందారు. మెకానికాల్​ ఇంజినీరింగ్​ పూర్తి చేసిన ఆమెకు 2016లో జడేజాతో వివాహం అయింది. 2019లో బీజేపీలో చేరిన రివాబా 2022 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తొలిసారి గెలిచి మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఆమె కేబినెట్​లో అవకాశం దక్కించుకున్నారు.