ePaper
More
    HomeజాతీయంParliament | పార్లమెంటులో ఎంపీలకు కొత్త​ మెనూ.. ఇకపై అవే తినాలి..!

    Parliament | పార్లమెంటులో ఎంపీలకు కొత్త​ మెనూ.. ఇకపై అవే తినాలి..!

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Parliament : ఎంపీల ఆహార పదార్థాల్లో మార్పు చోటుచేసుకోబోతోంది. కొత్త మెనూ అందుబాటులోకి వస్తోంది. రాబోయే సోమవారం (జులై 21) నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ఎంపీలకు కొత్త మెనూ ఉండనుంది.

    ఈ వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటు సభ్యులకు ఫుడ్​లో సమూల మార్పులు ఉండబోతున్నాయి. రాగి మిల్లెత్​తో చేసిన ఇడ్లీ, పెసర పప్పు దోశ, జవార్ ఉప్మా అల్పాహారం(breakfast)గా అందిస్తారు. వీటికితోడు చేపల వేపుడు, ఇతర ప్రత్యేక వంటకాలు కూడా ఉంటాయి.

    ఆహారంలో తక్కువ కార్బొహైడ్రేట్లు, కేలరీలు, ఎక్కువ ఫైబర్, సోడియం, ప్రొటీన్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఈ మేరకు పార్లమెంటు క్యాంటీన్ సిద్ధం అవుతోంది.

    పార్లమెంటు వర్షాకాల monsoon session సమావేశాలు ఈ నెల 21న మొదలుకానున్నాయి. ఆగస్టు 12 వరకు ఈ సమావేశాలు ఉంటాయి. ఉభయసభలు కూడా 21 రోజుల పాటు సమావేశం అవుతాయి. ఆగస్టులో 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రక్షాబంధన్ Raksha Bandhan, స్వాతంత్య్ర దినోత్సవ Independence Day సెలవులు ఉంటాయి.

    Parliament : మార్పులివీ

    ఈసారి సెషన్ నేపథ్యంలో క్యాంటీన్‌కు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా కీలక సూచనలు చేశారు. ఎంపీలకు రుచికరమైన, పోషకాహారమైన వంటకాలను అందించాలన్నారు. దీనికితోడు పలు రకాల వంటకాలను స్పీకర్​ నిర్దేశించారు.

    ఈ నేపథ్యంలో ఎంపీల కోసం పార్లమెంటు క్యాంటీన్‌ కొత్త మెనూను రూపొందించింది. నోరూరించే కర్రీలు, వెరైటీల థాలీలు (thalis), మిల్లెట్‌ వంటకాలు(millet dishes), ఫైబర్ సలాడ్‌లు(fiber salads), ప్రొటీన్​ సూప్‌లు వడ్డించనున్నారు. ప్రతీ వంటకంలో కార్బొహైడ్రేట్లు carbohydrates, సోడియం, కేలరీలు తక్కువగా ఉండేలా జాగ్రత్తపడనున్నారు. ప్రతి వంటకం నేమ్ పక్కనే, దానిని స్వీకరించడం ద్వారా లభించే కేలరీల సమాచారం పొందుపర్చుతారు.

    Parliament : కొత్తగా పొందుపర్చిన ఆహార మెనూలో..

    • రాగి మిల్లెట్ ఇడ్లీ(Ragi Millet Idli) – చట్నీ, సాంబార్ (270 కిలో కేలరీ)
    • జవార్ ఉప్మా(Jawar Upma) – (206 కిలో కేలరీ)
    • మిక్స్ మిల్లెట్ ఖీర్(Mix Millet Kheer) (sugar less) (161 కిలో కేలరీ)
    • చనా ఛాట్ (Chana Chat)
    • పెసర పప్పు దోశ (Pesara Pappu Dosa)
    • బార్లీ, జవార్ సలాడ్‌ (Barley, Jawar Salad)- (294 కిలో కేలరీ)
    • గార్డెన్ ఫ్రెష్ సలాడ్, టమాటాల వేపుడు, బాసిల్ షోర్బా, వెజిటేబుల్ క్లియర్ సూప్‌(113 కిలోకేలరీ)

    Parliament : మాంసాహారుల ప్రియుల కోసం..

    • ఉడికించిన కూరగాయలతో గ్రిల్డ్ చికెన్ (Grilled Chicken) (157 కిలోకేలరీలు)
    • గ్రిల్డ్ చేపలు (Grilled Fish) (378 కిలోకేలరీలు)

    Parliament : ఇంకా..

    గ్రీన్ టీలు, హెర్బల్ టీ, మసాలా సత్తు, బెల్లం ఫ్లేవర్‌తో మ్యాంగో పన్నా

    More like this

    ACB Raid | రూ.4 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన అధికారిణి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raid | అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. కార్యాలయాలకు వచ్చే వారి నుంచి అందిన...

    Sub Collector Vikas Mahato | పీహెచ్​సీ సబ్​సెంటర్​ నిర్మాణం కోసం స్థల పరిశీలన

    అక్షరటుడే, కోటగిరి: Sub Collector Vikas Mahato | పోతంగల్ (Pothangal)​ మండలంలోని హెగ్డేలి(Hegdely) గ్రామానికి మంగళవారం బోధన్​...

    Maggari Hanmandlu | బీఆర్​ఎస్​కు షాక్​.. పార్టీకి సొసైటీ ఛైర్మన్​ రాజీనామా

    అక్షరటుడే, బోధన్​: Maggari Hanmandlu | బీఆర్​ఎస్​కు షాక్​ తగిలింది. ఇటీవల పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్​...