అక్షరటుడే, వెబ్డెస్క్ : New IT Act | దేశంలో ఏప్రిల్ 1 నుంచి కొత్త ఐటీ చట్టం- 2025 అమలు చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తెలిపారు. కొత్త చట్టంలో ట్యాక్స్ నిబంధనల్లో సడలింపులు ఉంటాయన్నారు.
విద్య, వైద్య సేవలపై టీసీఎస్ 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించారు. విదేశీ టూర్ల ప్యాకేజీలకు, మ్యాన్ పవర్ సరఫరా చేసే సంస్థలపై టీసీఎస్ తగ్గింపు ఉంటుందన్నారు. మోటార్ యాక్సిడెంట్ (Motor Accident) చెల్లింపులపై పన్ను సడలింపులు ఇచ్చారు. మార్చి 31 వరకు ఆదాయపన్ను చెల్లింపునకు గడువు ఉంటుందని మంత్రి తెలిపారు. జులై 31 వరకు ITR 1, ITR 2 ఫైల్ చేయొచ్చన్నారు. విదేశీ ఆస్తుల ప్రకటనకు వన్ టైమ్ స్కీమ్ అమలు చేస్తామని వెల్లడించారు. నామ మాత్రపు ఫీజుతో రిటర్న్లు సవరించటానికి అవకాశం కల్పిస్తామని తెలిపారు. సామాన్యులు సైతం ఐటీఆర్ ఫైల్ చేసేలా త్వరలో సులభమైన ప్రక్రియను ప్రవేశ పెడుతామన్నారు.
New IT Act | పర్యాటక కేంద్రాల అభివృద్ధి
దేశంలో పర్యాటక రంగం అభివృద్ధి చేస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, అరకు, పశ్చిమ కనుమల్లో పర్యటక కేంద్రాల అభివృద్ధికి నిధులు ఖర్చు చేస్తామని ప్రకటించారు. ఒడిశా, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లో తాబేలు కేంద్రాలు అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ పర్యాటక కేంద్రాల్లో శాశ్వత అభివృద్ధి కోసం మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సరిహద్దుల్లోని పక్షులను వీక్షించటానికి రైళ్లు ఏర్పాటు చేస్తామన్నారు.
New IT Act | ఎన్ఆర్ఐ పెట్టుబడుల పెంపు
దేశంలో ఎన్ఆర్ఐ పెట్టుబడులు 10 నుంచి 24 శాతానికి పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. దీంతో స్టాక్ మార్కెట్ల (Stock Markets)కు ఎక్కువగా పెట్టుబడులు రానున్నట్లు తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ రంగంలో బూస్టింగ్ వస్తుందని అంచనా. 20 పర్యాటక ప్రదేశాలలో 10 వేల మంది గైడ్ల నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఆమె ఒక పైలట్ పథకాన్ని ప్రతిపాదించారు. భారతదేశాన్ని వైద్య-విలువ పర్యాటక కేంద్రంగా మారుస్తామన్నారు.