ePaper
More
    Homeబిజినెస్​New IPO | మార్కెట్లోకి మరో ఐపీవో

    New IPO | మార్కెట్లోకి మరో ఐపీవో

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : New IPO | ఈవారంలో స్టాక్‌ మార్కెట్‌ను (stock market) ఐపీవోలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే ఏజిస్‌ వొపాక్‌ టెర్మినల్‌, స్కూలాస్‌ బెంగళూరు లిమిటెడ్‌ ఐపీవోల సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభం కాగా.. మంగళవారం నుంచి మరో ఐపీవో బిడ్డింగ్‌ (IPO bidding) మొదలు కాబోతోంది. ఇన్వర్టర్ల తయారీదారు అయిన ప్రోస్టార్మ్ ఇన్ఫో సిస్టమ్స్ కంపెనీ (Inverter manufacturer Prostarm Info Systems Company) పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ. 168 కోట్లు సమకూర్చుకోవాలన్న లక్ష్యంతో ఐపీవోకు వస్తోంది. మంగళవారం నుంచి సబ్‌స్క్రిప్షన్ ప్రారంభమవుతుంది. మే 29న ముగుస్తుంది. 30న అలాట్‌మెంట్‌ స్టేటస్‌ (allotment status) తెలిసే అవకాశాలున్నాయి. వచ్చేనెల 3వ తేదీన బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో కంపెనీ షేర్లు లిస్టవుతాయి.

    New IPO | ధరల శ్రేణి..

    కంపెనీ ధరల శ్రేణిని రూ.95 నుంచి రూ. 105గా నిర్ణయించింది. లాట్‌లో 142 షేర్లుంటాయి. ఒక లాట్‌ కోసం రూ. 14,910తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

    New IPO | కోటా, జీఎంపీ

    ఈ IPOలో 50 శాతం అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారులకు (institutional buyers), 35 శాతం రిటైల్ పెట్టుబడిదారులకు (retail investors), 15 శాతం హెచ్ ఎన్ ఐ లకు రిజర్వ్ చేశారు. జీఎంపీ రూ. 25 ఉంది. అంటే లిస్టింగ్ రోజే 23 శాతం లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

    New IPO | కంపెనీ వివరాలు..

    ప్రొస్ట్రామ్‌ ఇన్ఫో సిస్టమ్స్‌ కంపెనీని (Prostrom Info Systems Company) 2008లో స్థాపించారు. యూపీఎస్ సిస్టమ్స్ (UPS systems), ఇన్వర్టర్ సిస్టమ్స్, సోలార్ హైబ్రిడ్ ఇన్వెర్టర్ సిస్టమ్స్, లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్, వోల్టేజ్ స్టెబిలైజర్స్ వంటి వివిధ రకాల పవర్ సొల్యూషన్ ప్రొడక్ట్‌‍్సను డిజైన్ చేయడంతో పాటు తయారు చేసి విక్రయిస్తుంది.

    కంపెనీ 2023లో రూ. 232.35 కోట్ల ఆదాయం సంపాదించగా.. 2024లో రూ. 259.23 కోట్లకు పెరిగింది. లాభాలు రూ. 19.35 కోట్లనుంచి రూ. 22.83 కోట్లకు చేరాయి. ఇదే కాలంలో ఆస్తులు రూ. 155.39 కోట్లనుంచి రూ. 203.05 కోట్లకు పెరిగాయని సంస్థ ప్రకటించింది.

    More like this

    Formula E Race Case | ఫార్మూలా ఈ రేసులో భారీగా అవినీతి.. ఏసీబీ సంచలన నివేదిక

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Formula E Race Case | రాష్ట్రంలో స్థానిక ఎన్నికల (Local Body Elections)...

    Nizamabad City | జెండాగల్లిలో పేకాట..

    అక్షర టుడే, వెబ్ డెస్క్: Nizamabad City | నగరంలోని జెండాగల్లిలో పేకాట స్థావరంపై నాలుగో టౌన్ పోలీసులు...

    Renjal Mandal | విద్యార్థులకు ఖురాన్ అందజేత

    అక్షరటుడే, బోధన్: Renjal Mandal | పట్టణంలోని రెంజల్ బేస్​లో గల నిజామియా పాఠశాలలో విద్యార్థులకు ఖురాన్ పుస్తకాలు,...