ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​AP Tourism | ఏపీలో టూరిజం అభివృద్ధికి కొత్త హోటళ్లు

    AP Tourism | ఏపీలో టూరిజం అభివృద్ధికి కొత్త హోటళ్లు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:AP Tourism | ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం అమరావతి(Amaravati)లో రాజధాని పనులు వేగవంతం చేసింది. అమరావతి నగరంలో సకల వసతులు కల్పించి అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అంతేగాకుండా రాజధానిలో మౌలిక వసతులకు పెద్దపీట వేయాలని యోచిస్తోంది. అంతేగాకుండా పర్యాటకంగా ఏపీని అభివద్ధి చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో కొత్తగా పలు హోటళ్ల(New Hotels) నిర్మాణానికి గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది.

    అమరావతిలో రూ.145 కోట్లతో గ్రీన్ పార్క్ హోటల్(Green Park Hotel), పోలవరంలో రూ.255 కోట్లతో ఫైవ్‌స్టార్ రిసార్ట్(Five-star resort) నిర్మాణానికి మైగ్లాన్ సంస్థకు భూమి, ప్రోత్సాహకాలు కల్పించారు. తిరుపతిలో రూ.80.46 కోట్లతో పావని హోటల్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆయా హోటళ్లు అందుబాటులోకి వస్తే పర్యాటకులకు మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

    AP Tourism | పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం

    ఏపీని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్​ షెకావత్(Minister Gajendra Singh Shekhawat)​ తెలిపారు. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు గురువారం ఆయన శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్​(Andhra Pradesh)లో పర్యాటక రంగ అభివృద్ధికి అవకాశాలు, వనరులు మెండుగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. బుద్దిస్ట్‌ సర్క్యూట్‌, కోస్టల్‌లో ఎకో టూరిజం ఏర్పాటు చేస్తామన్నారు. ఏపీలో రూ.450 కోట్లతో పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం సైతం కొత్తగా హోటళ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం గమనార్హం.

    More like this

    Stock Markets | చివరలో ప్రాఫిట్‌ బుకింగ్.. స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Markets | టారిఫ్‌ల విషయంలో అనిశ్చితి(Tariff uncertainty) కొనసాగుతుండడం, ఎఫ్‌ఐఐ(FII)లు వరుసగా పెట్టుబడులు...

    Telangana University | తెయూలో విద్యార్థుల ఆందోళన: హెల్త్​కేర్​ సెంటర్​లో ఔషధాలు ఉంచాలని డిమాండ్​

    అక్షరటుడే,డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలోని హెల్త్​కేర్​ సెంటర్​ (Healthcare Center) ఎదుట సోమవారం విద్యార్థులు ఆందోళనకు...

    Heavy Rains | మాయదారి వాన.. వర్ష బీభత్సంపై కవి ఆవేదన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Rains | కామారెడ్డి జిల్లాలో 15 రోజుల క్రితం వర్షం బీభత్సం సృష్టించిన...