- Advertisement -
Homeతాజావార్తలుNew GST slabs | నేటి నుంచే కొత్త జీఎస్టీ శ్లాబ్‌లు.. ధరలు తగ్గే వస్తువులివే..

New GST slabs | నేటి నుంచే కొత్త జీఎస్టీ శ్లాబ్‌లు.. ధరలు తగ్గే వస్తువులివే..

- Advertisement -

అక్షరటుడే, న్యూఢిల్లీ: New GST slabs | జీఎస్టీ సంస్కరణలు(GST reforms) సోమవారం (సెప్టెంబర్‌ 22) నుంచి అమలులోకి వచ్చాయి. దీంతో వంటగదిలో ఉపయోగించే వస్తువుల దగ్గర నుంచి ఎలక్ట్రానిక్స్‌, మందులు(Medicines), ఆటోమొబైల్స్‌.. ఇలా చాలా వరకు వస్తువుల ధరలు తగ్గనున్నాయి.

జీఎస్‌టీ 2.0లో మొత్తం 375 రకాల ఉత్పత్తులపై పన్నురేట్లు తగ్గనున్నాయి. ఆ జాబితాలో నెయ్యి(Ghee), పనీర్‌, వెన్న, నమ్‌కీన్‌, కెచప్‌, జామ్‌, డ్రై ఫ్రూట్స్‌, కాఫీ, ఐస్‌ క్రీములు వంటివాటితో పాటు.. టీవీ(TV), ఏసీ, వాషింగ్‌ మెషీన్స్‌ కూడా ఉన్నాయి.

- Advertisement -

ఔషధాలు, గ్లూకోమీటర్లు, డయాగ్నోస్టిక్‌ కిట్‌ల ధరలూ తగ్గనున్నాయి. హెయిర్‌ ఆయిల్‌, టాయిలెట్‌ సబ్బులు, డిటర్జెంట్‌ బార్లు, షాంపూలు, టూత్‌ బ్రష్‌లు, టూత్‌ పేస్టులు(Tooth paste), టాల్కమ్‌ పౌడర్స్‌, ఫేస్‌ పౌడర్స్‌, షేవింగ్‌ క్రీమ్‌, ఆఫ్టర్‌ షేవ్‌ లోషన్‌ వంటి రోజువారీ వినియోగ వస్తువులు చౌకగా లభించనున్నాయి.

సిమెంట్‌ 18 శాతం జీఎస్టీ పరిధిలోకి రావడంతో గృహ నిర్మాణదారులు ప్రయోజనం పొందుతారు. జీఎస్టీ రేటు తగ్గింపు వల్ల వాహనాల కొనుగోలుదారులు లాభపడతారు.

ఇప్పటికే దాదాపు అన్ని వాహనాల కంపెనీలు తగ్గిన ధరలను వెల్లడించాయి. వ్యక్తిగత జీవిత, ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియం కూడా తగ్గనుంది.

జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, ఫార్మసీలు తమ ఎమ్మార్పీని సవరించాలని లేదా తక్కువ రేటుకు మందులను విక్రయించాలని ప్రభుత్వం(Government) ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.

New GST slabs | వివిధ ఉత్పత్తులపై జీఎస్టీ ప్రభావం..

  • హెల్త్‌క్లబ్‌లు, సెలూన్లు, వ్యాయామ యోగా కేంద్రాలపై, ఫేస్‌ పౌడర్‌, షేవింగ్‌ క్రీమ్‌, సబ్బులు వంటి వ్యక్తిగత సౌందర్య ఉత్పత్తులపై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. హోటల్‌ గదులపైనా జీఎస్టీ 12 శాతంనుంచి 5 శాతానికి తగ్గనుంది.
  • ఔషధాలపై గతంలో 12 శాతం జీఎస్టీ ఉండేది. ప్రస్తుతం ఇది 5 శాతానికి తగ్గింది. క్యాన్సర్‌(Cancer), ఇతర సంక్లిష్ట వ్యాధుల చికిత్సలో వినియోగించే 36 ఔషధాలపై పూర్తిగా పన్ను మినహాయించారు.
  • నాలుగు మీటర్ల వరకు పొడవున్న అన్ని కార్ల(Cars)పై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. 350 సీసీ కంటే తక్కువ సామర్థ్యం ఉన్న బైక్‌లకూ ఈ శ్లాబ్‌ వర్తిస్తుంది. దీంతో బైక్‌ల ధరలూ తగ్గాయి.
  • టీవీలపై జీఎస్టీ శ్లాబ్‌ను 28 శాతం నుంచి 18 శాతానికి మార్చారు. దీంతో ఆయా టీవీల ధరలు రూ. 2,500 నుంచి రూ. 85,000 వరకు తగ్గనున్నాయి. స్క్రీన్‌ పరిమాణం 32 అంగుళాల కంటే ఎక్కువ ఉన్న టీవీ సెట్లకు ఇది వర్తిస్తుంది.
- Advertisement -
- Advertisement -
Must Read
Related News