అక్షరటుడే, ఎల్లారెడ్డి: new Gram Panchayat | కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలో కొత్తగా ఏర్పడిన గ్రామపంచాయతీ Gram Panchayats లో భారాస BRS party పాగా వేసింది. గ్రామపంచాయతీలుగా ఏర్పడిన కన్నారెడ్డి, చిన్న ఆత్మకూరు గ్రామాల్లో భారాస బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు.
కన్నారెడ్డి గ్రామంలో 301 ఓట్లు ఉన్నాయి. కాగా, భారాస పార్టీ బలపరిచిన అభ్యర్థి మాసగళ్ళ సాయిలుకు 201 ఓట్లు వచ్చాయి. అంటే తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి దండు సాయిలుపై 128 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు .
new Gram Panchayat | వార్డుల్లో సైతం..
అలాగే ఆరు వార్డుల్లో ఐదు చోట్ల భారాస బలపర్చిన అభ్యర్థులే గెలుపొందారు. చిన్న ఆత్మకూర్ గ్రామంలో 595 ఓట్లు ఉండగా 530 ఓట్లు పోలయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థి అనిత 12 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ 8 వార్డులకు గాను, ఆరు వార్డుల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండు వార్డుల్లో సైతం ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధించారు. దీంతో రెండు గ్రామాల్లో కూడా గెలుపొందిన అభ్యర్థులు సంబరాలు నిర్వహించుకున్నారు.