HomeతెలంగాణPetrol Bunk | పెట్రోల్​ బంక్​లో నయా మోసం..

Petrol Bunk | పెట్రోల్​ బంక్​లో నయా మోసం..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Petrol Bunk | పెట్రోల్​ బంక్​ల(Petrol Bunk) నిర్వాహకులు తమ లాభాల కోసం వాహనదారులను మోసం(Fraud) చేస్తున్నారు. మీటర్లలో సెట్టింగ్​లు మార్చడంతో పాటు చిప్​లు పెట్టి తక్కువ పెట్రోల్​ వచ్చేలా చేస్తున్నారు. దీంతో వాహనదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన హైదరాబాద్​లోని(Hyderabad) ఉప్పల్​ పరిధిలో చోటు చేసుకుంది.

ఉప్పల్ పరిధిలో మెహిఫిల్​ రెస్టారెంట్(Mehfil Restaurant)​ ఎదురుగా ఉన్న భారత్ పెట్రోల్ పంపు(Bharat petrol pump)లో ఓ వ్యక్తి రూ.100 పెట్రోల్​ను బాటిల్​లో పోయించాడు. అయితే తక్కువ పెట్రోల్​ రావడంతో ఆయన సిబ్బందిని ప్రశ్నించాడు. దాంతో వంద రూపాయలకే అంతే వస్తుందని బంక్​ సిబ్బంది దబాయించారు. దీంతో సిబ్బందిపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీటర్‌లో సెట్టింగ్ చేసి తక్కువ పెట్రోల్(Petrol) పోసి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. అంతేగాకుండా పలువురు వాహనదారులు పోగై సిబ్బందిని నిలదీయడంతో వారు నీళ్లు నమిలారు. పొరపాటున అలా వచ్చిందని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇలాంటి బంక్​లపై కఠిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

Must Read
Related News