అక్షరటుడే, ఇందూరు: Nizamabad | భారతీయ గ్రామీణ కర్మాచారి సంఘ్ (Indian Rural Workers’ Association) నూతన కార్యవర్గాన్ని ఆదివారం నగరంలోని ఆర్ఎస్ఎస్ భవన్లో(RSS Bhavan) ఎన్నుకున్నారు.
నూతన అధ్యక్షుడిగా చంద్రశేఖర్, కార్యదర్శిగా వేణుగోపాల్, కోశాధికారిగా దేవరాజు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ.. సంఘం అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తానని తెలిపారు.
కార్యక్రమంలో బీఎంఎస్(BMS) గ్రూప్ సి తెలంగాణ కార్యదర్శి లక్ష్మీనారాయణ, సర్కిల్ సెక్రెటరీ లింబాద్రి, అసిస్టెంట్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, డివిజనల్ సెక్రెటరీ సాయ రెడ్డి, వినయ్, సుదీర్ తదితరులు పాల్గొన్నారు.