Armoor
Armoor | పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

అక్షరటుడే, ఆర్మూర్‌ : Armoor | పట్టణంలోని పద్మశాలి సంఘం (Padmasali Society) ఎన్నికలు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా 8 తర్పల సంఘాలతో ఏర్పడిన పట్టణ సంఘానికి అధ్యక్షుడిగా మ్యాక మోహన్‌ దాస్‌ ఎన్నికయ్యారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా కొక్కుల రమాకాంత్, కోశాధికారిగా బత్తుల భాస్కర్, సర్వ సమాజ్‌ ప్రతినిధిగా కొక్కుల విద్యాసాగర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

నూతన అధ్యక్షుడు మోహన్‌దాస్‌ మాట్లాడుతూ.. పద్మశాలిల సంక్షేమం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. నిర్మాణంలో ఉన్న కమ్యూనిటీ భవనం (Community building) పనులు సకాలంలో పూర్తి చేస్తానని అన్నారు. కార్యవర్గం సహకారంతో, అన్ని తర్ప అధ్యక్షుల సలహాదారుల సూచనలతో సంఘ అభివృద్ధికి పాటు పడతానన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ త్రివేణి గంగాధర్, చిట్ల ప్రకాష్, తాళ్ల హరిచరణ్, చౌకే లింగం, అంబళ్ల శ్రీనివాస్, తర్పల అధ్యక్షులు అంబటి, బండి అనంతరావు, చిట్ల యగ్నేష్, రుద్ర రాజేశ్వర్, సైబ సుధాకర్, వేముల ప్రకాష్, సదామస్తుల గణపతి, కొక్కుల రమాకాంత్‌ , కాండీ ధర్మపురి, దాసరి సునీల్, ఆడెపు ప్రభాకర్ పాల్గొన్నారు.