ePaper
More
    HomeతెలంగాణPower Diploma Engineers Association | పవర్ డిప్లొమా ఇంజినీర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం

    Power Diploma Engineers Association | పవర్ డిప్లొమా ఇంజినీర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Power Diploma Engineers Association | తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజినీర్స్ అసోసియేషన్ నిజామాబాద్ సర్కిల్ ఎన్నికలు ఆదివారం నిర్వహించారు.

    ఎన్నికల అధికారిగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్, సహాయ ఎన్నికల అధికారిగా కరీంనగర్(Karimnagar) సర్కిల్ సెక్రెటరీ సంపత్ వ్యవహరించారు. కాగా.. సర్వసభ్య సమావేశం అనంతరం నిజామాబాద్ సర్కిల్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

    సర్కిల్ అధ్యక్షుడిగా రాజేందర్ రెడ్డి, కార్యదర్శిగా కాశీనాథ్, కోశాధికారిగా శ్రీనివాస్, మహిళా ప్రతినిధిగా సుష్మిత, ఆఫీస్ సెక్రెటరీగా ఎస్ఆర్ మూర్తి, నిజామాబాద్ డివిజన్ కార్యదర్శిగా శ్రీనివాస్, కోశాధికారిగా భరత్, బోధన్ కార్యదర్శిగా కృష్ణ, కోశాధికారిగా గిరిధర్, ఆర్మూర్ కార్యదర్శిగా గంగాధర్, కోశాధికారిగా కాంతారావు, మోర్తాడ్ డివిజన్ కార్యదర్శిగా శ్రీనివాస్​, కోశాధికారిగా జుబేర్ ఎన్నికయ్యారు.

    Power Diploma Engineers Association | ఇంజినీర్లది కీలక పాత్ర..

    విద్యుత్ శాఖలో (Electricity Department) ఇంజినీర్లదే కీలక పాత్ర అని అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యేశ్వర అన్నారు. ప్రతి ఉద్యోగి విద్యుత్ సంస్థ కోసం నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. సంస్థ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్, కార్యనిర్వాహక కార్యదర్శి తోట రాజశేఖర్, సర్కిల్ కార్యదర్శి కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

    మాట్లాడుతున్న అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యేశ్వర

    More like this

    Nepal | నేపాల్‌ లో విధ్వంసం.. అధ్యక్షుడు, ప్రధాని ఇళ్లకు నిప్పు.. పలువురు మంత్రులపై దాడి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal | నేపాల్‌ లో రెండోరోజూ విధ్వంసకాండ కొనసాగింది. యువత ఆందోళనలతో హిమాయల దేశం...

    CP Sai Chaitanya | పోలీస్​ ఇమేజ్​ పెంచేవిధంగా విధులు నిర్వర్తించాలి: సీపీ సాయిచైతన్య

    అక్షరటుడే, బోధన్​: CP Sai Chaitanya | నిజామాబాద్​ కమిషనరేట్​ పరిధిలో పోలీస్​ ఇమేజ్​ను పెంచే విధంగా సిబ్బంది...

    Alumni reunion | 14న పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    అక్షరటుడే, భిక్కనూరు: Alumni reunion | మండలంలో జిల్లా పరిషత్​ బాలుర ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం...