Homeఆంధప్రదేశ్AP Govt | ఏపీలో కల్తీ మద్యం కలకలం.. పరిష్కారానికి త్వరలో ‘ఏపీఏటీఎస్’ యాప్

AP Govt | ఏపీలో కల్తీ మద్యం కలకలం.. పరిష్కారానికి త్వరలో ‘ఏపీఏటీఎస్’ యాప్

నకిలీ మద్యం విషయంలో కూటమి ప్రభుత్వం సీరియ‌స్‌గా స్పందించింది. కల్తీ మద్యం విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు త్వరలోనే ప్రత్యేక మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: AP Govt | ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం విషయంలో తీవ్ర దుమారం రేగిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) కీలక చర్యలకు శ్రీకారం చుట్టారు. ములకలచెరువు నకిలీ మద్యం కేసులో టీడీపీ నేత అరెస్టుతో ప్రారంభమైన వివాదం, అధికార కూటమి–వైసీపీ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నకిలీ మద్యం నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. నకిలీ మద్యం అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం APATS (Andhra Pradesh Anti-Toxic Spirits) పేరుతో ప్రత్యేక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తేనుంది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు మద్యం సీసాలపై ఉండే QR కోడ్‌ను స్కాన్ చేసి, మద్యం సరఫరా వివరాలు, తయారీ తేదీ, నాణ్యత ప్రమాణాలు, గడువు తేదీ వంటి కీలక సమాచారం తెలుసుకోగలుగుతారు.

AP Govt | వినియోగదారుల భద్రతకే ప్రధాన ప్రాధాన్యం

వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ యాప్ రూపొందిస్తున్నాం. నకిలీ మద్యం వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోకూడదు. అందుకే ఇది అత్యవసర చర్య” అని సీఎం చంద్రబాబు Chandra babu స్పష్టం చేశారు. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, “APATS యాప్‌తో ప్రతి మద్యం సీసా లేబుల్‌ను స్కాన్ చేస్తే, అది అసలైనదేనా, నకిలీదా అన్నది వెంటనే తెలుస్తుంది.

వాస్తవికత నిర్ధారించుకునే అధికారం ప్రజల చేతుల్లోకి వస్తుంది” అని చెప్పారు. వైసీపీ నేతలు కూటమి పాలనపై నకిలీ మద్యం ఆరోపణలు చేస్తుండగా, చంద్రబాబు తీసుకొచ్చిన ఈ యాప్ ప్రతిపక్ష విమర్శలకు కౌంటర్ అటాక్‌గా కనిపిస్తోంది. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో నకిలీ మద్యం తయారీ జరుగుతోందని ఆరోపిస్తున్న వైసీపీకి, ఈ డిజిటల్ చొరవతో గట్టి సమాధానం ఇచ్చే ప్రయత్నంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ యాప్ అందుబాటులోకి వస్తే, నకిలీ మద్యం వ్యాపారులకు గట్టి ఎదురుదెబ్బ తగలడం ఖాయం. మద్యం (Liquor) విక్రయాలను పారదర్శకంగా మార్చే దిశగా ఇది కీలక అడుగుగా కనిపిస్తోంది. అయితే, ఈ యాప్‌ను ఎప్పటి నుంచి ప్రజలు ఉపయోగించవచ్చో మాత్రం ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఏపీలో కల్తీ మద్యం పై కొనసాగుతున్న దుమారానికి డిజిటల్ పరిష్కారంతో సమాధానం ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం, రాష్ట్ర పరిపాలనలో నూతన ఆవిష్కరణకు నిదర్శనం. వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడడమే లక్ష్యంగా రూపొందుతున్న APATS యాప్, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో మద్యం విక్రయాల (liquor sales) విధానాన్ని మార్చివేసే అవకాశముంది.