JR.NTR | పాపం.. ఎన్టీఆర్‌ని ఇలా టార్గెట్ చేశారేంటి.. ముస్లిం అంటూ ట్రోలింగ్
JR.NTR | పాపం.. ఎన్టీఆర్‌ని ఇలా టార్గెట్ చేశారేంటి.. ముస్లిం అంటూ ట్రోలింగ్

అక్షరటుడే, వెబ్​డెస్క్​: JR.NTR | ఇప్పుడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య వార్ (india-pakistan war) ఎంత హీట్ పెంచేస్తుందో మ‌నంద‌రికి తెలిసిందే. బార్డ‌ర్‌లో భార‌త్ – పాక్ మ‌ధ్య భీక‌ర పోరు న‌డుస్తుంది. ప‌హ‌ల్గాం లో జరిగిన దాడికి (pahalgam attack) బదులు తీర్చుకునే ప్రయత్నం గా భారత్ – పాక్ లో ఉన్న ఉగ్ర స్థావరాలపై దాడులకు (india attack on pakistan terror camps) దిగ్గింది. అనుకున్న విధంగానే తొమ్మిది ఉగ్రస్ధావరాలను పూర్తిగా నేలమట్టం చేసింది. దానికి ప్రతిచర్యగా ఇండియా India పై దాడికి దిగింది పాకిస్తాన్. వారికి చుక్క‌లు చూపిస్తున్నారు భార‌త సైన్యం (indian army). ఒక‌వైపు బాంబులు, మిస్సైల్స్‌తో దాడులు (bombs and missiles attack) జ‌రుగుతుండ‌గా, మ‌రో వైపు సోషల్ మీడియాలో హిందూ ముస్లింస్ వార్ (hindu-muslim war on social media) న‌డుస్తుంది. కొంద‌రు సెల‌బ్రిటీలు ముస్లిం అంటూ వారిని ట్రోల్ చేస్తున్నారు.

JR.NTR | ఎందుకంత నెగెటివిటి..

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ (young tiger NTR) ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఆయ‌న నటన , డ్యాన్స్ (acting and dance) గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. నందమూరి కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికి, అనతి కాలంలోనే త‌న టాలెంట్‌తో స్టార్ హీరోగా ఎదిగాడు. సినిమాలే త‌న ప్ర‌పంచంగా బ్ర‌తుకుతూ వివాదాల‌కి దూరంగా ఉండే ఎన్టీఆర్‌పై ఒక్కసారిగా విమ‌ర్శ‌లు చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి తీసుకువచ్చారు. ఆయన్ను కొందరు నెటిజన్లు టార్గెట్ (netizens target) చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. పహెల్గాం దాడి (pahalgam attack) తర్వాత ఇండియాలో పరిస్థితులు ఎలా మారాయో మ‌నం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఉగ్రవాదులు హిందువులా, ముస్లింలా అని అడిగి మరీ హిందువులను కాల్చి చంపారు.

ఇటువంటి తరుణంలో కొందరు దుర్మార్గులు జూనియర్ ఎన్టీఆర్‌ను టార్గెట్ చేసుకుని అతనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ (junior NTR) ముస్లిం వ్యక్తి అని, అతను నందమూరి తారక రామారావుగా (nandamuri taraka ramarao) మార్చుకున్నారని కామెంట్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అసలు పేరు మహమ్మద్ షరీఫ్ రసూల్ ఖాన్ (junior NTR real name was mohmmed sharif rasool khan) అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ (social media troll) చేస్తున్నారు. ఆయ‌న‌ ఆ పేరుని ఆయన నందమూరి తారక రామారావుగా మార్చుకొని షార్ట్ కట్ లో జూనియర్ ఎన్టీఆర్ అంటూ (junior NTR converted name as nandamuri taraka rama rao) పిలిపించుకుంటున్నారు అంటూ ట్రోల్ చేస్తున్నారు. యూపీఐడి ఒకటి షాప్ నేమ్ మరొకటి అంటూ దారుణంగా క్రిటిసైజ్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పై జరుగుతున్న ఈ ట్రోలింగ్ నందమూరి ఫ్యాన్స్ కి (NTR fans) ఆగ్ర‌హం క‌ట్టలు తెంచుకుంటుంది.