అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ganesh Idols | గణేశుని నవరాత్రి ఉత్సవాలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా అంతటా కూడా వేడులను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు.
అయితే కొంతమంది ఉత్సాహం పేరుతో ట్రాక్ తప్పుతున్నారేమో అనే భావన ప్రజలలో కలుగుతోంది. ప్రత్యేకత కోసం వినాయక మండపాల్లో వినూత్న డిజైన్లకు ప్రాధాన్యం ఇవ్వడం సహజమే. కానీ ఈసారి కొంతమంది నిర్వాహకులు తమ అభిమానాన్ని దేవుడిపై ప్రతిబింబించే ప్రయత్నం చేయడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్(Hyderabad)లో ఒక మండపంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రూపాన్ని పోలిన వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Ganesh Idols | పలు రూపాల్లో విగ్రహాలు..
ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో నిర్వాహకులు వెంటనే దానిని తొలగించి, సాధారణ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కర్నాటకతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో RCB (Royal Challengers Bangalore) జెర్సీలో ఉన్న వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. IPL 2025 ట్రోఫీ చేత పట్టుకుని ఉన్న వినాయక విగ్రహం, అలాగే క్రికెట్ ఆడుతున్న 11 గణేశులు ఉన్న థీమ్ మండపం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందని నెటిజన్లు మండిపడుతున్నారు. పుష్ప, ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) వంటి సినిమా కాన్సెప్ట్‌లతో పాటు, ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) రూపాన్ని పోలిన విగ్రహాలు కూడా కొన్ని మండపాల్లో దర్శనమిచ్చాయి.
అయితే భక్తి పేరుతో ఈ రకమైన ప్రయోగాలు కొందరికి వినూత్నంగా అనిపిస్తున్నా.. చాలా మందికి ఇది అసహ్యాన్ని కలిగిస్తోంది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో భక్తులు మరియు నెటిజన్ల నుండి తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది. భక్తి పేరుతో దేవుడిని ప్రచార మాధ్యమంగా వాడుతున్నారా?, ఇది పూజా సమయమా? లేక ఫ్యాన్స్ షోనా, రేయ్, ఎవర్రా మీరంతా? దేవుడిని ఇలా తక్కువ చేస్తారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వినాయక చవితి పర్వదినం అంటే భక్తి, శ్రద్ధ, పూజ, ఆధ్యాత్మికతకు పర్యాయపదం. కానీ కొంతమంది వినాయకుడి (Lord Vinayaka) రూపాన్ని పబ్లిసిటీ ప్లాట్‌ఫారమ్‌గా వాడడం విచారకరం. అభిమానం ఉండడం తప్పు కాదు, కానీ అది ధర్మాన్ని దాటి, భక్తి విలువలను తుంచితే… దేవుడే కాదు, సమాజం కూడా క్షమించదు.