అక్షరటుడే, వెబ్‌డెస్క్:Donald Trump | అమెరికా అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుండి ట్రంప్ వార్తలలో నిలుస్తూనే ఉన్నాడు. డొనాల్డ్ ట్రంప్(Donald Trump) గెలుపు కోసం ఎంతో కృషి చేసిన ఎలన్ మస్క్ ఇప్పుడు ఆయనతోనే విభేదించడం చర్చనీయాంశం అయింది. ఇద్దరి మధ్యా గొడవలు రోజు రోజుకు పెరుగుతున్నాయే తప్ప తగ్గటం లేదు. ట్రంప్‌కు బుద్ధి చెప్పాలన్న ఉద్దేశ్యంతో మస్క్ చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే.. ట్రంప్‌తో గొడవలతో ఇబ్బందిపడుతున్న మస్క్(Elon Musk)కు సూర్యుడు షాక్ ఇస్తున్నాడు. కోట్ల రూపాయల నష్టం తెస్తున్నాడు. ఒకరకంగా స్టార్ లింక్ ప్రాజెక్టు(Star Link Project)ను దెబ్బ తీస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే తాజాగా జరిగిన ఘటనపై నెటిజన్స్ ట్రంప్‌పై దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
Donald Trump | ట్రంప్‌పై ట్రోలింగ్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెట్ల (staircase)పై నుంచి జారి పడిపోబోయారు. న్యూజెర్సీ (New Jersey)లోని మోరిస్టౌన్‌లో గల మోరిస్టౌన్ మున్సిపల్ ఎయిర్‌పోర్ట్ లో శనివారం చోటు చేసుకున్న ఘటనకి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.. అక్కడి నుంచి బయల్దేరే సమయంలో ఎయిర్ ఫోర్స్ వన్ (Air Force One) ఎక్కుతున్న ట్రంప్.. ఒక్కసారిగా మెట్లపై అదుపుతప్పారు. అయితే వెంటనే కోలుకుని పైకి లేచారు. రెయిలింగ్‌ను పట్టుకుని లేచి విమానంలోకి ఎక్కేశారు. ఈ ఘటనలో అధ్యక్షుడికి ఎలాంటి ప్రమాదం జరగలేదు
ట్రంప్‌తోపాటు ఎయిర్‌ఫోర్స్ వన్ ఎక్కేటప్పుడు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో కూడా తడబడ్డారు. అధ్యక్షుడు ట్రంప్ కిందపడిపోబోతున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. గత అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden)తో ట్రంప్‌ను పోలుస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ‘ఇదే బైడెన్ అయ్యి ఉంటే ఈపాటికి మీడియా నెట్‌వర్క్‌లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ వచ్చేది’, ‘ట్రంప్ మెట్లు ఎక్కలేకపోతున్నారు.. ఆయన అధ్యక్షుడిగా ఉండటానికి అనర్హుడు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, గత అధ్యక్షుడు జో బైడెన్ చాలాసార్లు ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం ఎక్కుతూ కిందపడిపోబోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ట్రంప్ కూడా అలా తూలడంతో ఆయన అధ్యక్షుడి పదవికి అనర్హులు అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.