అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Sara Tendulkar | మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ మరోసారి సోషల్ మీడియాలో (Social Media) చర్చనీయాంశంగా మారారు. గోవాలో తన స్నేహితులతో కలిసి రోడ్డుపై నడుస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ కావడంతో, కొందరు నెటిజన్లు ఆమెపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
ఆ వీడియో ఎప్పటిదీ అనే విషయంపై అధికారిక నిర్ధారణ లేకపోయినా, నూతన సంవత్సర వేడుకల సమయంలోది అని సోషల్ మీడియా వర్గాలు చెబుతున్నాయి. వీడియోలో సారా స్నేహితులతో సరదాగా నడుచుకుంటూ కనిపించగా, ఆమె చేతిలో ఉన్న బాటిల్‌ను చూపిస్తూ అది బీర్ బాటిల్ అంటూ కొందరు అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఇంతటితో ఆగకుండా, కొందరు నెటిజన్లు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) పేరును కూడా లాగుతూ విమర్శలు గుప్పించడం వివాదానికి దారి తీసింది.
Sara Tendulkar | బాటిల్ చేతిలో..
అయితే, ఈ ట్రోలింగ్‌కు వ్యతిరేకంగా సారాకు పెద్ద ఎత్తున మద్దతు కూడా లభిస్తోంది. “ఇది ఎంత వెనుకబడిన ఆలోచనా విధానం? సారా బీర్ తాగితే అది సచిన్ మద్యం ప్రచారం చేసినట్టా? ఒక కుమార్తెకి తన జీవితాన్ని ఆస్వాదించే హక్కు లేదా?” అంటూ ఒక యూజర్ ప్రశ్నించాడు. “ఇక్కడ ట్రోల్ చేయాల్సిన విషయం ఏముంది?” అంటూ మరో యూజర్ స్పందించాడు. సెలబ్రిటీల కుటుంబ సభ్యుల వ్యక్తిగత జీవితాలపై ఇలాంటి వ్యాఖ్యలు అనవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా, గత ఆగస్టులో సారా టెండూల్కర్ తాను క్రికెట్ కెరీర్ ఎందుకు ఎంచుకోలేదన్న విషయంపై స్పష్టత ఇచ్చారు. ఆమె సోదరుడు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) ప్రస్తుతం గోవా తరఫున ఆల్‌రౌండర్‌గా డొమెస్టిక్ క్రికెట్ ఆడుతున్నప్పటికీ, తనకు మాత్రం క్రికెట్‌పై కెరీర్ స్థాయిలో ఆసక్తి ఎప్పుడూ రాలేదని సారా వెల్లడించారు. “గల్లీ క్రికెట్ ఆడాను కానీ, నాన్నలా క్రికెటర్ కావాలన్న ఆలోచన ఎప్పుడూ రాలేదు. అది నా సోదరుడి ప్రపంచం” అని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
ప్రొఫెషనల్‌గా చూస్తే, సారా టెండూల్కర్ ఇటీవలే వెల్నెస్ రంగంలోకి అడుగుపెట్టారు. ముంబై అంధేరిలో ఓ పిలాటిస్ స్టూడియోను ప్రారంభించిన ఆమె, ఆరోగ్యం మరియు ఫిట్‌నెస్‌పై తనకున్న ఆసక్తిని వ్యాపారంగా మలిచారు. “నా ఫిట్నెస్ ప్రయాణంలో పిలాటిస్ కీలక పాత్ర పోషించింది. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే జీవితంలోని చిన్న ఆనందాలను ఆస్వాదించడమే అసలైన బ్యాలెన్స్” అని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం వైరల్ వీడియో (Viral Video) నేపథ్యంలో సారా టెండూల్కర్ పేరు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
View this post on Instagram