HomeతెలంగాణMiss world contestants | క‌ల్లు తాగి ఎంజాయ్ చేసిన మిస్ వ‌ర‌ల్డ్ పోటీదారులు.. వైర‌ల్...

Miss world contestants | క‌ల్లు తాగి ఎంజాయ్ చేసిన మిస్ వ‌ర‌ల్డ్ పోటీదారులు.. వైర‌ల్ అవుతున్న వీడియో

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Miss world contestants | తెలంగాణ Telangana రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్-2025 పోటీలు (miss world compitions) అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అట్ట‌హాసంగా జ‌రిగిన ఈ వేడుక‌లకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైర‌ల్ (photos and videos) అవుతున్నాయి. ఇక అందాల భామలు బృందాలుగా ఏర్పడి తెలంగాణలోని చారిత్రక ప్రదేశాలు, ప్రసిద్ధ ఆలయాలను (hestori places and temples) సందర్శించనున్నారు. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ‌లు తెలంగాణలో దొరికే స‌హ‌జ‌సిద్ధమైన “నీరా క‌ల్లును” (natural neera kallu) సేవించారు. కొంద‌రు జోష్‌తో సంద‌డి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైర‌ల్‌గా మారాయి. నీరా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందుకే వారు సేవించి ఉంటార‌ని కొంద‌రు కామెంట్ చేస్తున్నారు.

Miss world contestants | క‌ల్లు రుచి చూశారుగా..

మే 12న మిస్ వ‌ర‌ల్డ్ పోటీ దారులు (miss world contestants) నాగార్జునసాగర్ Nagarjuna Sagar లోని బుద్ధ వనాన్ని సందర్శించనున్నారు. ఈ నెల 15న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రాన్ని, భూదాన్‌ పోచంపల్లిలో పర్యటిస్తారు. వీరి రాకకోసం పర్యాటకశాఖ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. నాగార్జున సాగ‌ర్‌కి (nagarjuna sagar) హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక వాహనంలో ఆసియా దేశాలకు చెందిన 30 మంది మిస్‌ వరల్డ్‌ పోటీ దారులు (miss world contestants) వెళ్ల‌నున్నారు. నాగార్జునసాగర్‌ విజయవిహార్‌ అతిథి గృహానికి చేరుకుని ముస్తాబవుతారు. విజయ విహార్‌ వెనుక భాగాన సాగర తీరాన సుందరీమణులు మీడియా కోసం గ్రూప్ ఫొటోలు దిగుతారు.

విజయ్ విహార్ Vijay Vihar నుండి ప్రపంచ సుందరీమణులు సాయంత్రం బుద్ధవనానికి చేరుకుంటారు. బుద్ధవనం స్వాగతం తోరణం నుంచి నుంచే తెలంగాణ (telangana) సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలుకుతారు. రేపు బుద్దపూర్ణిమ (Buddha Purnima) కావడంతో బుద్ధుడి పాదాల వద్ద అందగత్తెలు పుష్పాంజలి ఘటిస్తారు. మహా స్తూపం వద్ద ఫొటో షూట్‌లో (photoshoot) పాల్గొంటారు. మహాస్తూపం లోపల మూడు నిమిషాలు ధ్యానం చేసి ఐదు నిమిషాల పాటు మాంగ్స్‌ చాటింగ్‌లో పాల్గొంటారు. ఇక్కత్‌ పట్టు వస్త్రాలకు భూదాన్ పోచంపల్లి ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ప్రపంచ పర్యాటక గ్రామంగా ఎంపికైన భూదాన్ పోచంపల్లికి ఈ నెల 15వ తేదీన 25 మంది ప్రపంచ సుందరీమణులు రానున్నారు. ఇక యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని (yadagirigutta lakshmi narsimha swamy tempel) 10 మంది సుందరీమణులు దర్శించుకొనున్నారు. ఈనెల 15వ తేదీన సాయంత్రం యాదగిరిగుట్టకు చేరుకొనీ ఆలయ తూర్పు మాఢవీధిలో ఉన్న అఖండ దీపారాధనకు ప్రత్యేక పూజలు చేస్తారు.