అక్షర టుడే, ఎల్లారెడ్డి: Yellareddy | ఎడారి దేశంలో ప్రేమించుకుని ఒకరికొకరు దగ్గరయ్యారు. దేశాలు వేరైనా మనసులు కలవడంతో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా (Kamareddy distric) మహమ్మద్‌నగర్ మండలం తెల్లాపూర్‌కు చెందిన రవీందర్ ఐదేళ్లుగా దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు.
ఈ క్రమంలో తాను పనిచేస్తున్న కార్యాలయంలోనే నేపాల్‌కు (Nepal) చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దేశాలు, సంప్రదాయాలు వేరైనా వారిద్దరు ఒక్కటి కావాలనుకున్నారు. ఇరువురు తమ ప్రేమను పెద్దల ముందుంచడంతో, పెద్దలూ ఓకే చెప్పారు.
దీంతో గురువారం గ్రామంలో వేద మంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు. నూతన దంపతులను కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు, నాయకులు ఆశీర్వదించారు. భారతీయ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవడం ఆనందంగా ఉందని నవ వధువు సంతోషం వ్యక్తం చేసింది.