అక్షరటుడే, వెబ్డెస్క్ : Nepal Government | నేపాల్ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. సోషల్ మీడియా సైట్‌లపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. యువత ఆందోళనతో దేశం అట్టుడుకుపోయిన నేపథ్యంలో ఓపీ సైలి ప్రభుత్వం (OP Saily Government) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
సోషల్ మీడియా సైట్‌లను నిషేధించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. వివిధ ప్రాంతాల్లో విధించిన కర్ఫ్యూను ఎత్తివేసింది. కేబినెట్ అత్యవసర సమావేశం తర్వాత ప్రభుత్వం సోషల్ మీడియా సైట్‌లను నిషేధించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు నేపాల్ కమ్యూనికేషన్, సమాచార, ప్రసార మంత్రి పృథ్వీ సుబ్బ గురుంగ్ (Minister Prithvi Subba Gurung) వెల్లడించారు. అంతేకాకుండా, ఖాట్మండు నడిబొడ్డున పార్లమెంట్ ముందు భారీ నిరసనకు నాయకత్వం వహించిన ‘జనరల్ జెడ్’ (General Z) డిమాండ్ల ప్రకారం సోషల్ మీడియా సైట్‌లను తిరిగి ప్రారంభించే ప్రక్రియను ప్రారంభించాలని సమాచార మంత్రిత్వ శాఖ సంబంధిత సంస్థలను ఆదేశించిందని గురుంగ్ చెప్పారు. నిరసన తెలుపుతున్న ‘జనరల్ జెడ్’ గ్రూపు తమ నిరసన కార్యక్రమాన్ని ఉపసంహరించుకోవాలని మంత్రి కోరారు.
Nepal Government | 19 మంది మృతి
నేపాల్ ప్రభుత్వం(Nepal Government) సూచన మేరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో విఫలమైనందుకు యూట్యూబ్, ఫేస్‌బుక్ ‘ఎక్స్’తో సహా 26 సోషల్ మీడియా సైట్‌లను నేపాల్ ప్రభుత్వం నిషేధించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వేలాది మంది యువత రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. సోమవారం జరిగిన నిరసనల్లో భాగంగా కొంతమంది పార్లమెంటు ఆవరణలోకి ప్రవేశించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పార్లమెంట్ మీద దాడి చేయడంతో నిరసనలు హింసాత్మకంగా మారాయి. పోలీసు కాల్పుల్లో 19 మంది మృతి చెందగా, 300 మందికి పైగా గాయపడ్డారు.
దీనికి బాధ్యత వహిస్తూ హోం మంత్రి రమేశ్ (Home Minister Ramesh) రాజీనామా కూడా చేశారు. పరిస్థితి దిగజారిన తర్వాత నేపాల్ సైన్యాన్ని రాజధానిలో మోహరించారు. న్యూ బనేశ్వర్‌లోని పార్లమెంటు ఆవరణ చుట్టూ ఉన్న రోడ్లను సైనిక సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పరిస్థితి చేయి దాటుతుండడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. దీంతో ఫేస్‌బుక్, ‘ఎక్స్’ వాట్సాప్ వంటి సోషల్ మీడియా సైట్‌లు (Social Media Site) సోమవారం రాత్రి నుంచి తిరిగి అందుబాటులోకి వచ్చాయి.
ప్రభుత్వం సోషల్ మీడియాను నియంత్రించాలని కోరుకుంటున్నట్లు నేపాల్ ప్రధాని ఓపీ సైనీ తెలిపారు. యువత మరణాలపై విచారం వ్యక్తం చేసిన కేపీ శర్మ ఓలి.. “శాంతియుత ప్రదర్శనలో కొన్ని అవాంఛనీయ శక్తుల చొరబాటు” ఉందని ఆరోపించారు. దీని వల్ల ప్రభుత్వ ఆస్తులు దెబ్బతినకుండా కాపాడడానికి ప్రభుత్వం బలప్రయోగం చేయాల్సి వచ్చిందన్నారు. సోషల్ మీడియా సైట్‌లను నియంత్రించాలన్న ఉద్దేశించలేదన్నారు 15 రోజుల్లోపు తన నివేదికను సమర్పించే దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.