అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nepal | ప్రపంచ క్రికెట్‌లో మరో సంచలన విజయం నమోదు చేసింది నేపాల్ (Nepal). టీ20 ఫార్మాట్‌లో ఆ దేశ క్రికెట్ జట్టు చరిత్రలో తొలిసారి ఐసీసీ టెస్ట్ హోదా కలిగిన జట్టుపై గెలుపు సాధించింది.
శనివారం షార్జాలో జరిగిన తొలి టీ20లో నేపాల్ 19 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను (West Indies) మట్టికరిపించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన నేపాల్ జట్టు (Nepal Team) 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ పౌడెల్ (Rohith Padel) అద్భుత ప్రదర్శనతో 35 బంతుల్లో 38 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బౌలింగ్‌లోనూ రాణించిన పౌడెల్ 3 ఓవర్లు వేసి ఒక కీలక వికెట్ తీశాడు.
Nepal | నేపాల్ సరికొత్త చరిత్ర..
చిన్న లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ (West Indies) తొలి నుంచే ఒత్తిడిలో పడింది. రెండో ఓవర్‌లోనే ఓపెనర్ కైల్ మేయర్స్ (Kyle Meyers) వికెట్ కోల్పోవడంతో గందరగోళంలో పడింది. వెంటవెంటనే వికెట్లు కోల్పోయిన విండీస్ 19 ఓవర్లలో 129 పరుగులకే ఆలౌటై 19 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది.
నేపాల్ బౌలర్లు దూకుడుగా బౌలింగ్ చేస్తూ కరీబియన్ జట్టుకు (Carrabian Team) ఒక్క దశలోనూ మ్యాచ్‌పై పట్టుబిగించే అవకాశమే ఇవ్వలేదు. ఈ చారిత్రాత్మక విజయంపై స్పందించిన నేపాల్ కెప్టెన్ రోహిత్ పౌడెల్… “ఈ విజయం క్రికెట్ అభిమానులందరికి అంకితం. ఇటీవల జెన్-జెడ్ ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి ఇది మా నివాళి అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.
నేపాల్ విజయంతో అంతర్జాతీయ క్రికెట్‌లో (International Cricket) తాము కూడా పోటీతత్వంతో ముందుకు సాగుతున్నామన్న నమ్మకాన్ని క్రికెట్ ప్రపంచానికి కలిగించింది. ఇప్పుడు సిరీస్‌లో 1-0 లీడ్‌తో ఉన్న నేపాల్, తదుపరి మ్యాచ్‌లపై కన్నేసి మరింత శక్తివంచన లేకుండా పోటీపడనుంది. నేపాల్ స్కోర్: 148/8 (20 ఓవర్లలో), వెస్టిండీస్ స్కోర్: 129 ఆలౌట్ (19 ఓవర్లలో), మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్: రోహిత్ పౌడెల్ (38 పరుగులు, 1 వికెట్). ఈ గెలుపుతో నేపాల్ తమ క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది.