Nepal accident | నేపాల్​లో ఘోర ప్రమాదం.. 18 మంది దుర్మరణం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Nepal accident | నేపాల్‌లోని ధాడింగ్ జిల్లా Dhading district గజురి Gajuri సమీపంలోని త్రిశూలి నది Trishuli river లో ప్రయాణికుల బస్సు పడిపోవడంతో 18 మంది దుర్మరణం చెందారు. పోఖారా Pokhara నుంచి ఖాట్మండు Kathmandu వైపు వస్తున్న బస్సు సోమవారం తెల్లవారుజామున 1.30 గంటలకు ఖాట్మండుకు పశ్చిమాన 90 కి.మీ దూరంలో ఉన్న పృథ్వీ హైవే వెంబడి త్రిశూలి నదిలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇరవై ఆరు మంది ప్రయాణికులు […]

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Nepal accident | నేపాల్‌లోని ధాడింగ్ జిల్లా Dhading district గజురి Gajuri సమీపంలోని త్రిశూలి నది Trishuli river లో ప్రయాణికుల బస్సు పడిపోవడంతో 18 మంది దుర్మరణం చెందారు.

పోఖారా Pokhara నుంచి ఖాట్మండు Kathmandu వైపు వస్తున్న బస్సు సోమవారం తెల్లవారుజామున 1.30 గంటలకు ఖాట్మండుకు పశ్చిమాన 90 కి.మీ దూరంలో ఉన్న పృథ్వీ హైవే వెంబడి త్రిశూలి నదిలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇరవై ఆరు మంది ప్రయాణికులు గాయపడ్డారని సాయుధ పోలీసు దళ ప్రతినిధి బిష్ణు ప్రసాద్ భట్టా వెల్లడించారు.

Nepal accident | సహాయక చర్యల్లో..

ప్రమాద స్థలం నుంచి పదిహేడు మృతదేహాలను వెలికితీశారు. మరో 28 మంది గాయపడిన ప్రయాణికులను రక్షించినట్లు భట్టా చెప్పారు. గాయపడిన ప్రయాణికులను చికిత్స నిమిత్తం వివిధ సమీప ఆసుపత్రులకు తరలించారు. నేపాల్ సైన్యం, సాయుధ పోలీసు దళం, నేపాల్ పోలీసు సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

మరణించిన వారిలో న్యూజిలాండ్‌ New Zealand కు చెందిన ఒక వ్యక్తి కూడా ఉన్నట్లు గుర్తించారు. ఇక గాయపడిన వారిలో ఒక జపనీస్, ఒక డచ్ జాతీయుడు, మహిళలు ఉన్నారు.

ప్రమాదానికి కచ్చితమైన కారణం ఇంకా నిర్ధారించలేదు. కానీ, అతి వేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Related articles

RTC Bus Falls Into Valley | లోయలో పడిన బస్సు : ప్రయాణికులకు గాయాలు

ఆదిలాబాద్ జిల్లాలో ఓ బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.

India Semi Chances | సూపర్ 8లో టీమిండియాకు భారీ షాక్.. సెమీస్ ఆశలు సజీవంగా ఉన్నాయా లేదా?

ఐసీసీ మెన్స్ వ‌ర‌ల్డ్ క‌ప్ టీ 20 సూపర్ 8 దశలో భార‌త జ‌ట్టుకు గట్టి దెబ్బ తగిలింది. సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఓటమి చవిచూసినా, సెమీఫైనల్ అవకాశాలు పూర్తిగా ముగియలేదు. అయితే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో భారత్ తప్పక విజయం సాధించాల్సిందే.

ex-railway-minister mukul roy | విషాదం.. గుండెపోటుతో రైల్వే మాజీ మంత్రి కన్నుమూత

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ex-railway-minister mukul roy | పశ్చిమ బెంగాల్‌కు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ కేంద్ర రైల్వే మంత్రి ముకుల్ రాయ్ (71)...

Feb 23 Gold Prices | బంగారం, వెండి ధరలలో స్వల్ప తగ్గుదల.. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా!

అక్షరటుడే, హైదరాబాద్​: Feb 23 Gold Prices | బంగారం, వెండిధ‌ర‌లలో స్వల్ప తగ్గుదల కనిపించినప్పటికీ బంగారం ధరలు ఇంకా భారీ స్థాయిలోనే కొనసాగుతున్నాయి....