HomeతెలంగాణOuter Ring Road | హైదరాబాద్ నగరానికి మణిహారమైన ఔటర్ రింగురోడ్డు.. మొత్తం పొడవు ఎంతంటే..!

Outer Ring Road | హైదరాబాద్ నగరానికి మణిహారమైన ఔటర్ రింగురోడ్డు.. మొత్తం పొడవు ఎంతంటే..!

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్: Outer Ring Road : హైదరాబాద్ (Hyderabad city) నగరం ఎంత‌వేగంగా అభివృద్ధి చెందుతుందో మ‌నం చూస్తూనే ఉన్నాం. దేశంలోని టాప్ 5 నగరాల్లో ఒకటిగా భాగ్య‌న‌గ‌రం (Bhagyanagar) నిలుస్తోంది. నగరంలో కొత్తగా ఫ్లైఓవర్లు (flyovers), అండర్ పాస్ వంతెనలు, కొత్త రహదారుల నిర్మాణం, మెట్రో, విస్తరణ వంటి పనులు పూర్తి కాగా, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి.

ఉత్తర తెలంగాణ(Telangana) జిల్లాల ప్రజలు నగరం నుంచి ఈజీగా రాకపోకలు సాగించేలా సికింద్రాబాద్ నుంచి శామీర్‌పేట వరకు డబుల్ డెక్కర్ కారిడార్లు కూడా ప్రతిపాదించారు. హైదరాబాద్ నగరానికి మణిహారమైన నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్‌ (Nehru Outer Ring Road) (ORR) న‌గ‌ర అభివృద్దిలో కీల‌క పాత్ర పోషిస్తోంది. ఇది ఒక మల్టీలేన్ ఎక్స్‌ప్రెస్‌వే, హైదరాబాద్ చుట్టూ నిర్మించబడిన మెగా ట్రాన్స్‌పోర్ట్ కారిడార్.

Outer Ring Road : ప్రాముఖ్యం ఏంటంటే..

ORR యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటంటే.. నగరానికి వచ్చే ట్రాఫిక్‌ను దారి మళ్లించడం. నగర విస్తరణకు మార్గం వీలు కల్పించడం. జాతీయ రహదారుల(national highways)ని క‌నెక్ట్ చేయ‌డం. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ట్రాన్స్‌పోర్ట్ మౌలిక సదుపాయాల అభివృద్ధి. కాగా.. ఈ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ (Nehru Outer Ring Road) మొత్తం పొడవు సుమారు 158 కిలోమీటర్లు. దీని వేగ పరిమితి 100 – 120 కిమీ / గంటగా నిర్ణ‌యించారు. ఇందులో లేన్‌లు 8 లేన్ (4+4) యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేగా ఉన్నాయి.

ఇక 2005లో దీనిని నిర్మించ‌డం మొద‌లు పెట్ట‌గా, 2018లో పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. నిర్మాణ బాధ్యతని హెచ్‌ఎమ్డీఏ (HMDA – Hyderabad Metropolitan Development Authority) తీసుకుంది.

ORR మార్గంలో ప్రధాన జంక్షన్లు చూస్తే.. గచ్చిబౌలి, శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌, పటాన్‌చెరు, మేడ్చల్, షామీర్‌పేట్, హయత్‌నగర్, పెద్దగుట్ట‌, కొల్లూరు ఉన్నాయి. ఈ మార్గంలో 33కి పైగా ఇంటర్‌చేంజ్‌లు ఉన్నాయి. వీటివల్ల ఇతర జాతీయ, రాష్ట్ర రహదారులతో అనుసంధానం మెరుగ్గా ఉంటుంది.

GHMC పరిధిలోని ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్ట్ లేదా జాతీయ రహదారులపై తక్కువ సమయంలో ఓఆర్ఆర్ ద్వారా చేరవచ్చు. నెహ్రూ ORR హైదరాబాద్ నగర రూపాన్ని మార్చిన ఒక మార్గదర్శక ప్రాజెక్ట్. ఇది నగర లాజిస్టిక్స్, ప్రయాణికుల మౌలిక సదుపాయాలు, అభివృద్ధి వ్యూహాలకు కీలకమైన ఆధారంగా నిలిచింది.

నగర వృద్ధిని దీర్ఘకాలికంగా దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఈ ప్రాజెక్ట్, దేశంలో ఇతర మెట్రో నగరాలకు ఆదర్శంగా నిలుస్తోంది. హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్వహణను వేలంపాటలో దక్కించుకున్న ప్రయివేటు సంస్థకు కాసుల పంట పడుతోంది.

రూ.7,380 కోట్లకే ముప్పై ఏళ్ల పాటు ఓఆర్‌ఆర్‌ కాంట్రాక్టును దక్కించుకున్న సంస్థకు తొలి 16 నెలలకే ఏకంగా రూ.వెయ్యి కోట్ల ఆదాయం వచ్చింది. దేశంలోని ఏ మహా నగరానికి లేని విధంగా హైదరాబాద్‌ చుట్టూరా 158 కిలోమీటర్ల మేర నిర్మించిన జవహర్‌లాల్‌ నెహ్రూ ఔటర్‌ రింగ్‌ రోడ్డు తెలంగాణ‌కే Telangana గ‌ర్వ‌కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు.