Kamareddy Collector
Kamareddy Collector | పారిశుధ్య పనుల్లో నిర్లక్ష్యం.. మున్సిపల్ సిబ్బందికి నోటీసులు

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Collector | పట్టణంలో మున్సిపల్ సిబ్బందిపై కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్​ (Collector Ashish Sangwan) సీరియస్ అయ్యారు. తన ఆదేశాలను బేఖాతరు చేస్తూ పారిశుధ్య కార్యక్రమాల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు మున్సిపల్ సిబ్బందికి షోకాజ్ నోటీసు జారీ చేయాలని మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డిని (Municipal Commissioner Rajender Reddy) కలెక్టర్ ఆదేశించారు.

వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి మున్సిపాలిటీలోని (Kamareddy Municipality) 15 వ వార్డులోని వినాయక నగర్ కాలనీలో అధిక వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతు పనులను శుక్రవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లు, డ్రెయినేజీలు అత్యవసరంగా పునరుద్ధరణ కోసం ఎస్డీఆర్ఎఫ్ కింద మంజూరు ఇచ్చిన పనులను వెంటనే పూర్తి చేయాలని గతంలో అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

అయితే తాను ఆదేశించినప్పటికీ శానిటేషన్ పనులు సక్రమంగా జరగకపోవడంతో కలెక్టర్​ సీరియస్​గా తీసుకున్నారు. వెంటనే సంబంధిత ఏరియా సానిటరీ జవాన్​తో పాటు సానిటరీ ఇన్​స్పెక్టర్లకు 24 గంటలలో సమాధానం ఇవ్వాలని షోకాజ్ నోటీస్ జారీ చేయాలని మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డిని ఆదేశించారు. ఈ తనిఖీల్లో కలెక్టర్​తో మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్, వర్క్ ఇన్​స్పెక్టర్లు, శానిటేషన్ ఇన్​స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.