అక్షరటుడే, బోధన్: Vanamahotsavam | వనమహోత్సవాన్ని నిర్లక్ష్యం చేసే అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి (MLA Sudarshan Reddy) కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డిని(Collector Vinay Krishna Reddy) ఆదేశించారు. రెండో విడత వనమహోత్సవంలో భాగంగా బోధన్ మండలం బెల్లాల్(Bellal) గ్రామంలో కలెక్టర్‌తో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 51 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మొక్కలు నాటడమే కాదు వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులేనన్నారు. ఏ అధికారైనా నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో (Bodhan Sub-Collector Vikas Mahato), ఉర్దూ అకాడమీ ఛైర్మన్(Chairman of Urdu Academy) తాహెర్, జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Vanamahotsavam | నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి

అక్షరటుడే, ఇందల్వాయి: నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి(MLA Dr. Bhupathi Reddy) అన్నారు. బుధవారం ఇందల్వాయి ఫారెస్ట్ నర్సరీలో ఏర్పాటు చేసిన వనమోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గతేడాది 43 లక్షలు మొక్కలు నాటి 100 శాతం టార్గెట్‌ను పూర్తి చేశామని వివరించారు. ప్రతిఒక్కరూ ఇంటి ఆవరణలో మొక్కలు వాటిని సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎఫ్‌వో భోగ నిఖిత, ఆర్డీవో రాజేంద్రకుమార్, ఎఫ్ఆర్వో రవి మోహన్ బట్, కాంగ్రెస్ నాయకులు ముప్ప గంగారెడ్డి, మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్, ఎక్స్ ఎంపీపీ ఇమ్మడి గోపి, తహశీల్దార్ వెంకట్రావు సిబ్బంది తదితరులు ఉన్నారు.
Vanamahotsavam | మొక్కల సంరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత

అక్షరటుడే, ఆర్మూర్: మొక్కలను పెంచడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యత కూడా చూడాలని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి(Armoor MLA Rakesh Reddy) పేర్కొన్నారు. వనమహోత్సవంలో భాగంగా ఆలూర్ మండలంలోని దేగాంలో మొక్కలు నాటారు. అనంతరం లక్ష్మీ నృసింహాస్వామి ఆలయంలో (Lakshmi Narasimha Swamy Temple) ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆవరణలో మొక్కలునాటారు. అబ్కారీ శాఖ(Excise Department) ఆధ్వర్యంలో సైతం ఈత చెట్లను నాటారు. అనంతరం గంగపుత్ర సభ్యులకు గంగమ్మ ఆలయ నిర్మాణం కోసం రూ.10 లక్షల ప్రొసీడింగ్ కాపీని అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్, గంగపుత్ర సంఘం అధ్యక్షుడు పెంటన్న, అధికారులు తదితరులు పాల్గొన్నారు.