అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Neetha Arjun Rathod Campaign | 34వ డివిజన్లో సేవ చేసేందుకు ఒక్కసారి అవకాశమివ్వాలని బీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థిని (BRS Corporator Candidate) నీతా అర్జున్ రాథోడ్ అన్నారు. ఆయా కాలనీల్లోని ప్రజలను కలుస్తూ ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.
Neetha Arjun Rathod Campaign | బీఆర్ఎస్ హయాంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి
నగరంలో బీఆర్ఎస్ (BRS) హయాంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి జరిగిందని నీతా అర్జున్ రాథోడ్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త (Bigala Ganesh Gupta) ఆధ్వర్యంలో డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. డివిజన్లో ప్రభుత్వ పథకాల అమలు కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కాలనీల్లో పలుచోట్ల మాలిక సదుపాయాలు కల్పించడంలో ప్రస్తుత పాలకులు విఫలమయ్యారన్నారు.
పోరాడైనా నిధులు సాధిస్తాం..
ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటామని నీతా అర్జున్ రాథోడ్ అన్నారు. డివిజన్‌కు రావాల్సిన నిధులను పోరాడి సాధిస్తామని అభివృద్ధి చేసేందుకు ఒక్కసారి తనకు కార్పొరేటర్‌గా అవకాశం ఇవ్వాలని ఆమె ఓటర్లను కోరారు. కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.