అక్షరటుడే, వెబ్‌డెస్క్: NEET Exam | నీట్ పీజీ పరీక్ష (Neet pg exam)ను వాయిదా వేస్తున్నట్లు ఎన్‌బీఈ(NBE) తెలిపింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15న పరీక్ష జరగాల్సి ఉంది. అయితే రెండు షిఫ్టులలో పరీక్షల నిర్వహణకు ఎన్‌బీఈ నిర్ణయించింది. దీనిపై పలువురు సుప్రీంకోర్టు (supreme court)ను ఆశ్రయించారు. రెండు షిఫ్టులతో పరీక్షలు నిర్వహిస్తే.. ఒక షిఫ్టులో వారికి కఠినంగా, మరొక షిఫ్ట్‌లో వారికి సులభమైన ప్రశ్నపత్రం వస్తోందని పలువురు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై మే 30న విచారణ జరిపిన న్యాయస్థానం ఒకే షిఫ్ట్‌లో పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. దీంతో తాజాగా పరీక్ష వాయిదా వేస్తున్నట్లు ఎన్‌బీఈ వెల్లడించింది. పరీక్ష తేదీని తర్వాత ప్రకటిస్తామని తెలిపింది. నీట్ పీజీ పరీక్షను ఒకే షిఫ్టులో నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో పరీక్ష కేంద్రాల ఏర్పాటు కోసం పరీక్షను వాయిదా వేసినట్లు పేర్కొంది.