ePaper
More
    Homeక్రీడలుNeeraj Chopra | నీరజ్​ చోప్రా సరికొత్త రికార్డు

    Neeraj Chopra | నీరజ్​ చోప్రా సరికొత్త రికార్డు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Neeraj Chopra | భారత స్టార్​జావెలిన్​త్రో ప్లేయర్‌ నీరజ్ చోప్రా(Neeraj Chopra) సరికొత్త రికార్డు సృష్టించాడు. భారత్​కు రెండు ఒలింపిక్​ పతకాలు అందించిన నీరజ్​ తాజాగా దోహా డైమండ్‌ లీగ్‌(Doha Diamond League)లో ఈటెను 90.23 మీటర్లు విసిరాడు. తన కెరీర్​లో తొలిసారి 90 మీటర్ల మార్క్‌ను నీరజ్ చోప్రా అధిగమించడం గమనార్హం. కాగా గతంలో ఆయన అత్యధికంగా 89.4 మీటర్లు దూరం ఈటెను విసిరాడు. తాజాగా ఆ రికార్డును బద్దలు కొట్టాడు. దోహలో జరిగిన పోటీల్లో మొదటి ప్రయత్నంలో ఈరజ్​జావెలిన్‌ను 88.44 మీటర్ల దూరం విసిరాడు. అనంతరం రెండో ప్రయత్నంలో ఫౌల్‌ అయ్యాడు. మూడో సారి 90.23 మీటర్ల మార్క్‌ అందుకున్నాడు. నాలుగో ప్రయత్నంలో 80.56 మీటర్లు విసిరిన నీరజ్‌ ఐదోసారి మళ్లీ ఫౌల్‌ అయ్యాడు. జర్మనీకి చెందిన జులియన్‌ వెబర్‌ ఏకంగా 91.06 మీటర్లు విసిరాడు. దీంతో ఆయన విజేతగా నిలవగా.. నీరజ్​ రెండోస్థానంతో సరిపెట్టుకున్నారు.

    Neeraj Chopra | రెండు ఒలింపిక్​ పతకాలు

    నీజర్​ చోప్రా భారత్​కు రెండు ఒలింపిక్​ పతకాలు(India Two Olympic medals) అందించాడు. 2020లో టోక్యోలో జరిగిన విశ్వ క్రీడల్లో బంగారం పతకం సాధించి నీరజ్​ చరిత్ర సృష్టించాడు. అథ్లెటిక్స్(Athletics)​ విభాగంలో బంగారు పతకం(Gold Medal) సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. ఆ సమయంలో ఆయన 87.58 మీటర్ల దూరం బల్లెం విసిరాడు. 2024లో పారిస్​లో జరిగిన ఒలింపిక్స్​లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన నీజర్​ రజత పతకం(Silver medal)తో సరిపెట్టుకున్నాడు. ఈ ఈవెంట్​లో నీరజ్​ 89.45 మీటర్ల దూరం జావెలిన్​ విసిరాడు. అయితే పాకిస్తాన్​ ప్లేయర్​ అర్షద్​ 92.97 మీటర్లు విసిరి ఆ పోటీల్లో బంగారు పతకం సాధించాడు. అయితే తాజాగా నీరజ్​ తన కెరీర్​లో తొలిసారి 90 మీటర్లు కంటే ఎక్కువ దూరం జావెలిన్​ను విసిరాడు.

    More like this

    Trump tariffs | మౌన‌మే స‌రైన స‌మాధానం.. ట్రంప్ టారిఫ్‌ల‌పై అమెరికా మాజీ అధికారి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Trump tariffs | అమెరికా సుంకాల‌పై భార‌త్ వ్యూహాత్మ‌క మౌనం పాటిస్తుండ‌డాన్ని అమెరికా దేశ...

    Bodhan | ఎస్బీఐ బ్యాంకులో భారీ చోరీ.. బ్యాంక్ కౌంట‌ర్ నుండి ఏకంగా రూ.5 లక్ష‌లు దొంగిలించిన బాలుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bodhan | బోధన్ పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of...

    Karnataka | పులి దాడి చేసిన‌ట్టు నాటకం.. పరిహారం వ‌స్తుంద‌ని భ‌ర్త‌ని చంపిన‌ భార్య

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karnataka | వన్యప్రాణి దాడిలో మరణిస్తే ప్రభుత్వం అందించే పరిహారాన్ని పొందాలన్న దురాశతో ఓ...